ఎవరి లెక్కలు నిజం?

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ                    మన తెలంగాణ / హైదరాబాద్ : జిఎస్‌టి లెక్కల విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ చెప్పింది నిజమా, రాష్ర్ట ప్రభుత్వం చెప్పింది నిజమా, లెక్కలు తెలియంది ఎవరికో, ఎవరి లెక్కలు నిజమో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చెప్పిన లెక్కలు నిజమని సిఎం కెసిఆర్ నిరూపించి అరుణ్ […]

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

                  

మన తెలంగాణ / హైదరాబాద్ : జిఎస్‌టి లెక్కల విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ చెప్పింది నిజమా, రాష్ర్ట ప్రభుత్వం చెప్పింది నిజమా, లెక్కలు తెలియంది ఎవరికో, ఎవరి లెక్కలు నిజమో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చెప్పిన లెక్కలు నిజమని సిఎం కెసిఆర్ నిరూపించి అరుణ్ జైట్లీకి తగిన సపమాధానం చెప్పాలని, లేనట్లయితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మఖ్ధుంభవన్‌లో అదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు గుండా మల్లేష్, ఈర్ల నర్సింహా, ఎన్.బాలమల్లేష్, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు డి.జి.నరసింహారావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకురాలు అరుణతో కలిసి డాక్టర్ నారాయణ మాట్లాడారు. “ప్రాజెక్టులపై పన్ను తగ్గించం. పన్ను తగ్గిస్తే రాష్ట్రానికి భారం. రాష్ట్రం చెప్పిన లెక్కలు తప్పు” అని అరుణ్ జైట్లీ రాష్ర్ట ప్రభుత్వాన్ని అవమానించడమే కాకుండా తెలంగాణ ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని, ఇది తెలంగాణ ప్రభుత్వ ఇజ్జత్ కా సవాల్ అని, లెక్కలపై నిగ్గు తేల్చాలని నారాయణ అన్నారు.

మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందన్నారు. సిఎం కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసినా ఫలితం లేకుం డా పోయిందన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో కలిసి కేంద్రం పై పోరాడుతారో రాష్ట్రానికి నష్టం చేస్తారో కెసిఆర్ ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. ప్రజలకు మేలు చేసే పెట్రోల్, డీజీల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాకుండా భారం మోపే వాటిని జాబితాలో చేర్చారన్నారు. సామాన్య ప్రజలపై భారం వేస్తూ కార్పోరేట్ కంపెనీలకు జిఎస్‌టి తగ్గించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీడి, చేనేత, కోళ్ళ పరిశ్రమకు జిఎస్‌టి గుదిబండగా మారిందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలకు ప్రజలపై ప్రేమ లేదని, మోడి పై ప్రేమ వుందని, కెసిఆర్ చంద్రబాబులు రాజకీయ బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిఎస్‌టి సమావేశం సందర్భంగా అరుణ్ జెట్లి నయా నిజాం ప్రభువులా వ్యవహరించారని విమర్శించారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టం పై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఒకే పన్ను విధానంలో ప్రభు త్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించారు. ప్రాజెక్టులపై పన్ను తగ్గించనట్లయితే సిఎం కెసిఆర్ కేంద్రంపై ధర్మయుద్దానికి సిద్దం కావాలన్నారు. డి.జి.నరసింహారావు మాట్లాడుతూ కెసిఆర్ కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తూ రాష్ట్ర ప్రయోజనాలను ప ణంగా పెడుతున్నారని ఆరోపించారు. జిఎస్‌టి వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడ్డా కెసిఆర్ నోరు మెదపకుండా కేంద్రం మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

Comments

comments

Related Stories: