స్వచ్ఛ ఒడి

మల్లపురం పాఠశాలకు జాతీయ పురస్కారం ఫలించిన పదేళ్ల బాలుడి కృషి ప్రధానోపాధ్యాయురాలి శ్రమకు దక్కిన గౌరవం                  తల్లాడ : పాఠశాలను దత్తత తీసుకున్న పదేళ్ల బాలుడు దుగ్గిదేవర శ్రీరఘునందన్ రెండేళ్ల నుంచి అందిస్తున్న సహకారం ఫలించింది. దానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటగిరి రాధ నిరంతర కృషి అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థ్ధాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం వరించింది. స్వచ్ఛభారత స్ఫూర్తిని బాల్యం నుంచి విద్యార్థుల్లో పెంపోదించే […]

మల్లపురం పాఠశాలకు జాతీయ పురస్కారం
ఫలించిన పదేళ్ల బాలుడి కృషి
ప్రధానోపాధ్యాయురాలి శ్రమకు దక్కిన గౌరవం

                

తల్లాడ : పాఠశాలను దత్తత తీసుకున్న పదేళ్ల బాలుడు దుగ్గిదేవర శ్రీరఘునందన్ రెండేళ్ల నుంచి అందిస్తున్న సహకారం ఫలించింది. దానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటగిరి రాధ నిరంతర కృషి అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థ్ధాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం వరించింది. స్వచ్ఛభారత స్ఫూర్తిని బాల్యం నుంచి విద్యార్థుల్లో పెంపోదించే ప్రయత్నం సహకారమైంది. స్వచ్ఛ విద్యాలయ నిర్వహణలో మరెన్నో పాఠశాలలకు తల్లాడ మండల పరిధిలోని మల్లవరం ప్రాథమిక పాఠశాల మార్గదర్శకమైంది. జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి మల్లవరం ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రంలో 26,148 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక ఆదర్శ పాఠశాలలు ఉండగా జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి 14 పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మల్లవరం ప్రాథమిక పాఠశాల జాతీయ స్థ్ధాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారంలో రెండోవ స్థ్ధానాన్ని దక్కించుకొని అరుదైన రికార్డును సృష్టించింది.

పాఠశాల నేపథ్యం… మౌలిక సౌకర్యాలు…

మల్లవరం ప్రాథమిక పాఠశాలలో 70మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 5వ తరగతి గదులు బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, పాఠశాల చుట్టూ ప్రహారి గోడ, వంటశాల, నీటివసతి, ఇంకుడుగుంత, కంపోస్టు డంపింగ్ గుంత, హ్యాండ్‌వాష్ ట్యాపులు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించారు.
హరితహారంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో 70 కుపైగా మొక్కలు నాటి వాటన్నింటిని సంరక్షించారు.

‘స్వచ్ఛ’త వైపు అడుగులు

మల్లవరం గ్రామానికి చెందిన దాసరి వీరభద్రరావు యూత్ క్లబ్,ఐడియా సేవా సంస్ధసభ్యులు స్వచ్చ భారత కార్యక్రమాలను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్ధాయిలో విస్పృత్తంగా నిర్వహించారు. ఈ స్ఫూర్తిని ఆదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛతవైపు అడుగులు పెట్టాయి. పాఠ శాలలో పారిశుద్ధ నిర్వ హణ, పరిసరాలు పరిశుభ్రం, తాగునీరు, విద్యార్థ్ధుల చేతులు శుభ్రం చేసుకునేందుకు సౌకర్యం వంటివాటిని పరిగణలోకి తీసుకొని 2015-16 సంవత్సరం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వచ్ఛ పాఠశాలను ఎంపిక చేసి పురస్కరాలను బహుకరించాలని కేంద్ర మానవ వనరుల
అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. దీంతో మల్లవరం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత సాధనకై ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

పదేళ్ల బాలుడి సహకారం..

ప్రధానోపాధ్యాయురాలి కృషి… మల్లవరం గ్రామంలోని దుగ్గిదేవర అజయ్‌కుమార్-విజయ లక్ష్మి దంపతుల ఏకైక పుత్రుడైన దుగ్గిదేవర శ్రీరఘునందన్ ప్రస్తుతం పదేళ్ల బాలుడు 2016వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదిన ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవ సందర్భంగా కుటుంబ పెద్దల ప్రోత్సాహంతో శ్రీ రఘునందన్ మల్లవరం ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లుగా పాఠశాలలో స్వచ్ఛత కోసం పరిశుభ్రమైన తాగు నీరు అందించేందుకు వాటర్‌ఫిల్టర్, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి తరగతి గదికి చెత్త కుండీలు, చేతులు శుభ్రం చేసేందుకు డెటాల్ హ్యాండ్‌వాష్ సబ్బులు, మొక్కల సంర క్షణకోసం నీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రతకు ఫినాయిల్ వంటివి సమకూరుస్తూ తమవంతు సహకారాన్ని రఘు నందన్ నిరంతరం అందిస్తున్నాడు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటగిరి రాధ, తోటి ఉపాధ్యాయుల సహకారంతో, విద్యార్థుల వ్యక్తిగత,పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు నిత్యం కృషిచేస్తుందన్నారు విద్యార్థ్ధులకు స్వచ్ఛ భారత కార్యక్రమం పట్ల అవగహన కల్పిస్తూ వారు విధిగాఆచరించేలా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మల్లవరం ప్రాథమిక పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా పేరుపొందింది. ముందుగా మల్లవరం పాఠశాలను రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రస్థ్ధాయికి ఎంపికైన వాటిలో నుంచి జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి పరిశీలన జరపగా తెలంగాణ రాష్ట్రంలోనే మల్లవరం పాఠశాల జాతీయ,రాష్ట్రీయ విద్యాలయ పురస్క రాలకు ఎంపిక కోసం దాసరి వీరభద్రరావు యూత్ క్లబ్, గ్రామ సర్పంచ్ మేడి సీతారాములు, ఎస్‌ఎంసి చైర్‌పర్సన్ మేడి ఇందిర, మాజీ చైర్‌పర్సన్ శ్రీరాముల తిరుపతమ్మ, గ్రామస్తులు ఎంతో తోడ్పాటు అందించి మల్లవరం ఖ్యాతిని పెంపొందించారు.

Comments

comments

Related Stories: