ఎస్‌బిఐ లాభం రూ.3,105 కోట్లు

 క్యూ1 ఫలితాలపై మొండి బకాయిల భారం ప్రభావం న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం రూ.3,105.35 కోట్లు నమోదైంది. జూన్ 30 ముగింపునాటి క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను శుక్రవారం బ్యాంక్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.867.32 కోట్లుగా ఉంది. మొండి బకాయిలు మరింతగా పెరగడం వల్ల స్టాండలోన్ ఆధారంగా చూస్తే బ్యాంక్ లాభం 20 శాతం డౌన్ అయింది. అయితే గతేడాదితో […]

 క్యూ1 ఫలితాలపై మొండి బకాయిల భారం ప్రభావం

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం రూ.3,105.35 కోట్లు నమోదైంది. జూన్ 30 ముగింపునాటి క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను శుక్రవారం బ్యాంక్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.867.32 కోట్లుగా ఉంది. మొండి బకాయిలు మరింతగా పెరగడం వల్ల స్టాండలోన్ ఆధారంగా చూస్తే బ్యాంక్ లాభం 20 శాతం డౌన్ అయింది. అయితే గతేడాదితో పోలిస్తే మూడింతల వృద్ధిని నమోదు చేసింది. ఇక 2016-17 తొలి త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ.69,414.82 కోట్లు నమోదవగా, ప్రస్తుత ఏడాది జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.70,776 కోట్లకు పెరిగింది. 2016-17 చివరి త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు 6.9శాతం ఉండగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అవి 9.97శాతానికి పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు కూడా 3.71 శాతం నుంచి 5.97 శాతం వరకూ పెరిగాయి. భారతీయ మహిళా బ్యాంక్‌తో సహా ఎస్‌బిబిజె, ఎస్‌బిఎం, ఎస్‌బిటి, ఎస్‌బిపి, ఎస్‌బిహెచ్ వంటి అనుబంధ సంస్థలను విలీనం చేసుకున్నందువల్ల ఈసారి త్రైమాసిక ఫలితాలు పోల్చదగినవి కావని ఎస్‌బిఐ పేర్కొంది. అంతేకాక ప్రొవిజన్లు 53.1 శాతం పెరిగి రూ.21,054.74 కోట్లుగా నమోదైనాయి. రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు ఆర్జించిన నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.17,606.01 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది రూ.14,437.31 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయాలు 11.03 శాతం పెరిగి రూ.8,005.66 కోట్లకు చేరాయి. కాగా స్టాక్ మార్కెట్లలో ఎస్‌బిఐ షేర్లు 5 శాతానికి పైగా పతనమయ్యాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం డౌన్

క్యూ1(ఏప్రిల్‌జూన్)లో బ్యాంక్ ఆఫ్ బరోడా(బిఒబి) నిక ర లాభం 52 శాతం పడిపోయింది. లాభం రూ.203.4 కోట్లుగా నమోదైంది. 2016 ఇదే సమయంలో లాభం రూ. 423.6 కోట్లుగా ఉంది. కేటాయింపులు రూ. 2,004 కోట్ల తో పోలిస్తే రూ.2,368 కోట్లతో 18 శాతం పెరిగాయి.
30 శాతం క్షీణించిన యుబిఐ లాభం
జూన్ 30 ముగింపునాటి తొలి త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) నికర లాభం 30 శాతం క్షీణించింది. బ్యాంక్ లాభం రూ. 117 కోట్లకు పరిమితమైంది. మొండిబాకీలు, భారీ కేటాయింపులు కారణంగా లాభాలు తగ్గుముఖం పట్టాయి. స్థూల నిరర్థక ఆస్థులు ఏకంగా 10.16 శాతం నుంచి 12.63 శాతానికి పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు 6.16 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగాయి. వరుస ప్రాతిపదికన లాభం పెరిగింది. మొండిబాకీలకు కేటాయింపులతో వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం క్షీణించింది.

Comments

comments

Related Stories: