రైతు సమస్యలపై అన్నదాత సుఖీభవ

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తూ ప్రజా నటుడిగా మన్ననలు పొందిన దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. అర్ధరాత్రి స్వాతంత్రం, దండకారణ్యం, భూపోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరేయ్ రిక్షా, అరణ్యం, నిర్భయ భారతం, రాజ్యాధికారం వంటి సామాజిక చిత్రాల్లో ఆయన నటించడమే కాకుండా కొన్నింటిని ఆయన స్వయంగా నిర్మించారు. ఇప్పుడు తాజాగా రైతన్నపై ఆయన ఒక సినిమాను రూపొందించనున్నారు. ఈ మూవీకి ‘అన్నదాత సుఖీభవ’ అనే టైటిల్‌ను ఖరారు […]

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తూ ప్రజా నటుడిగా మన్ననలు పొందిన దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. అర్ధరాత్రి స్వాతంత్రం, దండకారణ్యం, భూపోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరేయ్ రిక్షా, అరణ్యం, నిర్భయ భారతం, రాజ్యాధికారం వంటి సామాజిక చిత్రాల్లో ఆయన నటించడమే కాకుండా కొన్నింటిని ఆయన స్వయంగా నిర్మించారు. ఇప్పుడు తాజాగా రైతన్నపై ఆయన ఒక సినిమాను రూపొందించనున్నారు. ఈ మూవీకి ‘అన్నదాత సుఖీభవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ “ఆరుగాలం పండించే రైతు జీవితానికి ఎటువంటి భరోసా లేకుండా పోయింది. ఉద్యోగులు నెల నెల జీతాలతో పాటు పదవీ విరమణ తర్వాత పింఛన్లు తదితర బెనిఫిట్స్ పొందుతారు. మరి రైతు మాత్రం చనిపోయేంత వరకు భూమినే నమ్ముకొని బతకాల్సి వస్తుంది. కాయకష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఒక వేళ వచ్చినా దళారులు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ప్రకృతి, దళారుల మధ్య నలిగిపోతూ రైతు చివరికి బలవన్మరం పొందుతున్నాడు. ఈ రైతు సమస్యలను ఆధారంగా చేసుకొని రైతు చిరంజీవిగా ఉండాలనే భావనతో స్నేహ పతాకంపై  ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను”అని అన్నారు.

Related Stories: