600 పోస్టులకు రాష్ట్రస్థాయి

జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సురేష్ చందా కమిటీ సిఫారసు  హైదరాబాద్ : రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టుల ఖరారుపై నియామకమైన సురేష్ చందా కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మొత్తం 80 ప్రభుత్వ శాఖలలో 762 పోస్టులను సమీక్షించింది. శాఖాధిపతులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని 600 పోస్టులను రాష్ట్ర, 162 పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా ఖరారు చేసింది. జోనల్, మల్టీ జోనల్, […]

జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సురేష్ చందా కమిటీ సిఫారసు 

హైదరాబాద్ : రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టుల ఖరారుపై నియామకమైన సురేష్ చందా కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మొత్తం 80 ప్రభుత్వ శాఖలలో 762 పోస్టులను సమీక్షించింది. శాఖాధిపతులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని 600 పోస్టులను రాష్ట్ర, 162 పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా ఖరారు చేసింది. జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయి పోస్టులను రాష్ట్ర పోస్టులుగా ఖరారు చేయడం వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటనేది నివేదికలో వివరించారు. డిప్యూటీ తహశీల్దార్ పోస్టును రాష్ట్రస్థాయి గా మార్చడం మూలంగా రాష్ట్రవ్యాప్తంగా బదిలీ చేసే అధికారం ఉంటుం ది. ఉదాహారణకు నిర్మల్‌లో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్‌ను భద్రాచలం లేదా వనపర్తి బదిలీ చేయవచ్చు. రాష్ట్రస్థాయి పోస్టుగా మార్చడం వల్ల పదోన్నతులు సత్వరం లభిస్తాయి. ఇదే పోస్టును జిల్లా స్థాయిగా ఖరారు చేస్తే సత్వర పదోన్నతులు లభించవు. ఇలా పోస్టుల వారీగా లాభ, నష్టాలను వివరించారు.
ప్రస్తుత విధానం : రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి నియామకాలలో 80 శాతం స్థానికులు, 20 శాతం ఓపెన్ విభాగం కింద భర్తీ చేస్తున్నారు. జోనల్‌లో 70 శాతం స్థానికులు, 30 శాతం ఓపెన్, మల్లీ జోనల్‌లో 60 శాతం స్థానికులు, 40 శాతం ఓపెన్ కింద భర్తీ అవుతున్నాయి. నాలుగంచెల వ్యవస్థ బదులు, రెండంచెల వ్యవస్థ అమలు చేసేందుకు నియామకాలలో జోనల్ వ్యవస్థ రద్ధు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా అధ్యక్షతన అధ్యయనం కోసం కమిటీని నియమించింది. రెండంచెల విధానంలో జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. నేరుగా జరిపే నియామకాలలో జిల్లా స్థాయిలో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి పోస్టుల నియామకాలలో స్థానిక కోటా ఉండదు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
జోనల్ రద్ధుకు రాష్ట్రపతి ఆమోదం చాలు : రాష్ట్రంలో ఇప్పుడున్న జోనల్ వ్యవస్థ రద్ధు చేసేందుకు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఆర్డికల్ 371 డి ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలలో జోనల్ విధానాన్ని అమలుపరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే విధానం అమలవుతోంది.
రాష్ట్ర స్థాయిగా డిటి పోస్టు : డిప్యూటీ తహశీల్దార్ (డిటి) పోస్టును రాష్ట్రస్థాయి పోస్టుగా సురేష్ చందా కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా కొన్నింటిని, పదోన్నతుల ద్వారా మరికొన్నింటిని భర్తీ చేస్తున్నారు. బదిలీలు మాత్రం జోనల్ స్థాయిలో జరుగుతున్నాయి. ఒక జోన్ నుంచి మరో జోన్‌కు బదిలీ చేయడానికి వీలు లేదు. ఉద్యోగి ఇష్టప్రకా రం లేదా పైరవీలతో మరో జోన్‌కు డెప్యుటేషన్‌పై వెళ్తున్నారు. సురేష్ చందా కమిటీ సిఫారసు ప్రకారం రాష్ట్ర స్థాయికి వెళ్లడం మూలంగా రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. ఉద్యోగుల శ్రేయస్సు దృష్టా ఈ పోస్టును కొన్ని జిల్లాలకు పరిమితం చేయాలని సూచించారు. ఏడెనిమిది జిల్లాలకు పరిమితం చేయడం వల్ల ఉద్యోగి భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉండదని నివేదికలో పేర్కొన్నారు.
జిల్లా పోస్టులతో పదోన్నతులు కష్టం : మొత్తం 762 పోస్టులు ఉండగా 600 పోస్టులను రాష్ట్ర స్థాయికి మార్చడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. గతేడాది 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. విభజనానంతరం జిల్లాల పరిధితో పాటు పోస్టుల సంఖ్య తగ్గింది. అతి తక్కువ విస్తీర్ణంలో ఉ న్న జిల్లాలలో త్వరత్వరగా పదోన్నతులు లభించడం కష్టం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెజారిటీ పోస్టులను రాష్ట్ర స్థాయికి మార్చారు.

Related Stories: