డిఫరెంట్ ఎంటర్‌టైనర్ ‘సరోవరం’

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.శ్రీలత నిర్మాతగా పరిచయమవుతూ సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరోవరం’. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం సినిమా న్యూ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీలతతో పాటు హీరోహీరోయిన్‌లు, చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ “డిఫరెంట్  ఎంటర్‌టైనర్ […]

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.శ్రీలత నిర్మాతగా పరిచయమవుతూ సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరోవరం’. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం సినిమా న్యూ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీలతతో పాటు హీరోహీరోయిన్‌లు, చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ “డిఫరెంట్  ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది. మహిళా నిర్మాత శ్రీలత రూపొందిస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో విశాల్ మాట్లాడుతూ “మూవీ అద్భుతంగా తెరకెక్కింది. హీరోగా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది. సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకముంది”అని చెప్పారు. హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ “దర్శకుడు సురేష్ ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారు. సినిమా నిర్మాణంలో ఏవిధంగానూ రాజీపడకుండా తెరకెక్కించారు నిర్మాత శ్రీలత. ఈ చిత్రం సినిమా యూనిట్ అందరికీ మంచి పేరును తీసుకువస్తుంది”అని చెప్పారు.

Related Stories: