ఉద్యోగుల వాహనాలకు పోలీసు స్టిక్కరింగ్

                     సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు భోజనం అందజేసే అక్షయపాత్ర వాహనాలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగు లకు ఇబ్బందులు తలెత్తకుండా వారి వాహనాలను ప్రతిరోజు పోలీసులు తనిఖీ చేయకుండా స్టిక్కర్లను అందజేస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సంగా రెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడి […]

                    

సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు భోజనం అందజేసే అక్షయపాత్ర వాహనాలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగు లకు ఇబ్బందులు తలెత్తకుండా వారి వాహనాలను ప్రతిరోజు పోలీసులు తనిఖీ చేయకుండా స్టిక్కర్లను అందజేస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సంగా రెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడి ఎఫ్ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్ నెస్, ఇన్సురెన్స్, ఇతర సర్టిఫికెట్లు ఒకసారి పోలీసులకు చూ పిస్తే వారికి ఒక వాహనాలకు ఒక స్టిక్కర్ అతికిస్తామని, ఆ స్టిక్కర్‌తో పోలీసులు ప్రతిరోజు వాహనాలను ఆపబోరని అ న్నారు.

దీని వల్ల ఉద్యోగులకు పనివేళల్లో జరుగుతున్న ఆల స్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఉద్యోగులతో పాటు ఎవ రైనా కూడా తమ వాహనాలకు సంబంధించి పత్రాలను తీసు కువచ్చి సంగారెడ్డి ట్రాఫిక్ సిఐ వద్ద చూపించి స్టిక్కర్ పొంద వచ్చని ఆయన సూచించారు. అయితే ఈ స్టిక్కరింగ్ కేవలం వాహన పత్రాలకు సంబంధించి మాత్రమే వర్తిస్తుందని, డ్రైవ ర్‌కు లైసెన్సు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా చర్యలు తప్పవని అన్నారు. ఈ స్టిక్కరింగ్ కూడా కేవలం సంగారెడ్డి జి ల్లాకు మాత్రమే వర్తింపజేయడం జరిగిందని, ఇతర జిల్లాల కు వెళ్లితే వాహనాలకు సంబంధించి అన్ని దృవపత్రాలు వెం ట తీసుకొని వెళ్లాల్సి వుంటుందని తెలిపారు. పోలీసులు అం దజేసిన స్టిక్కరింగ్ వుంది కదా అని రోడ్డు భద్రతా నిబంధన లను ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్షయపాత్ర వాహనాలకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్టిక్కర్లను అతికించారు. ఈ సమావే శంలో అదనపు ఎస్పీ షేక్ లాల్ అహ్మద్, సంగారెడ్డి డిఎస్పీ ఎం.తిరుపతన్న తదితరులు పాల్గొన్నారు.

Related Stories: