ఆ వయసులో అవన్నీ ఎలా చేయగలను…

పాట్నా: అవినీతి కేసులో త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డం ప‌ట్ల ఆర్ జెడి అధినేత లాలూప్రసాద్‌ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజ‌స్వి యాద‌వ్ బిజెపిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ‌కీయ కుట్రతోనే త‌న‌పై కేసులు బనాయించార‌ని విమర్శించారు. తనపై వస్తున్న అవినీతి అరోపణలు అన్నీ అసత్యప్రచారాలని…  ప్ర‌ధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు కావాలనే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆర్ జెడి, జెడియు మ‌ధ్య ఉన్న బంధాన్ని విడదీసేందుకు వాళ్లు య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.  ‘2004లోని కేసులను ఇప్పుడు తనకు […]

పాట్నా: అవినీతి కేసులో త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డం ప‌ట్ల ఆర్ జెడి అధినేత లాలూప్రసాద్‌ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజ‌స్వి యాద‌వ్ బిజెపిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ‌కీయ కుట్రతోనే త‌న‌పై కేసులు బనాయించార‌ని విమర్శించారు. తనపై వస్తున్న అవినీతి అరోపణలు అన్నీ అసత్యప్రచారాలని…  ప్ర‌ధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు కావాలనే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఆర్ జెడి, జెడియు మ‌ధ్య ఉన్న బంధాన్ని విడదీసేందుకు వాళ్లు య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.  ‘2004లోని కేసులను ఇప్పుడు తనకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారని మండిపడ్డారు.  2004లో తాను ఓ పిల్ల‌వాడిని అని, అప్పుడు త‌న వ‌య‌సు 13-14 ఏళ్లు ఉంటాయ‌ని, మీసాలు కూడా రాని పిల్లోడు ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌డా అని తేజ‌స్వి యాద‌వ్ ప్ర‌శ్నించారు. ఆర్ జెడి, జెడియు కూటమి చాలా బలంగా ఉందన్నారు. జెడియుతో ఎలాంటి విభేదాలు లేవ‌ని,  త్వరలోనే బిజెపికి గ‌ట్టి స‌మాధానం ఇస్తామ‌న్నారు.

Related Stories: