నాకు సాయం చేయండి సుష్మాజీ…

ఇస్లామాబాద్: కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్ర చికిత్స నిమిత్తం మెడికల్ విసా ఇప్పించి సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో పాకిస్థానీ సుష్మా సాయం కోరింది. పాక్‌కి చెందిన ఫైజా తన్వీర్ అనే 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీంతో ఘజియాబాద్‌లోని ఇంద్రప్రస్థా డెంటల్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స చేయించుకోవడానికి నిర్ణయించుకుంది. దీనికోసం ఆమె ఆన్‌లైన్ ద్వారా హాస్పిటల్‌లో ముందుగానే రూ.5లక్షలు కట్టింది. కానీ అక్కడి భారత దౌత్యాధికారులు […]

ఇస్లామాబాద్: కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్ర చికిత్స నిమిత్తం మెడికల్ విసా ఇప్పించి సాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో పాకిస్థానీ సుష్మా సాయం కోరింది. పాక్‌కి చెందిన ఫైజా తన్వీర్ అనే 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతోంది.

దీంతో ఘజియాబాద్‌లోని ఇంద్రప్రస్థా డెంటల్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స చేయించుకోవడానికి నిర్ణయించుకుంది. దీనికోసం ఆమె ఆన్‌లైన్ ద్వారా హాస్పిటల్‌లో ముందుగానే రూ.5లక్షలు కట్టింది. కానీ అక్కడి భారత దౌత్యాధికారులు మెడికల్ వీసాకు అనుమతించడంలేదు. దాంతో ఆమె సుష్మా సాయం కోరింది. తన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు సాయం చేయండి సుష్మాజీ.. నన్ను బతికించండి ప్లీజ్’ అని ట్వీట్ చేసింది.

Pakistani woman suffering from cancer seeks Sushma Swaraj’s help for Medical visa.