అమలు చేయకపోతే జైలు

రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తాం, జిఎస్‌టి రేట్లు ప్రజలకు తెలిసేలా ఉండాలి పాత సామాగ్రిని అమ్మేందుకు గడువు: రాంవిలాస్ పాశ్వాన్ న్యూఢిల్లీ: జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) అమలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యా పారులను హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వస్తువులకు కొత్త జిఎస్‌టి ధరలను ముద్రించకపోతే జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు. […]

రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తాం, జిఎస్‌టి రేట్లు ప్రజలకు తెలిసేలా ఉండాలి
పాత సామాగ్రిని అమ్మేందుకు గడువు: రాంవిలాస్ పాశ్వాన్

న్యూఢిల్లీ: జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) అమలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యా పారులను హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వస్తువులకు కొత్త జిఎస్‌టి ధరలను ముద్రించకపోతే జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వస్తువులను కొత్త గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్‌పి)తో సెప్టెంబర్‌లోగా అమ్ముకోవాలని తయారీ సంస్థలకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. జిఎస్‌టిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు వినియోగదారుల మం త్రిత్వశాఖ కమిటీని ఏర్పాటు చేసిందని.. పన్నులకు సం బంధించిన ప్రశ్నలపై సమాధానాలు ఇచ్చేందుకు హెల్ప్ లైన్ల సంఖ్యను 14 నుంచి 60కి పెంచిందని పాశ్వాన్ తెలి పారు. ఇప్పటికే 700కు పైగా సందేహాలు హెల్ప్‌లైన్లకు వచ్చాయి. వీటి పరిష్కారం కోసం ఆర్థిక నిపుణుల సహా యం తీసు కుంటున్నామని అన్నారు.

అమ్ముడుపోని సరుకులపై సవరించిన ధరలు ము ద్రించాలని ఇప్పటికే ఆదేశించామని, కొత్త ధరలతో స్టిక్కర్లు అంటిస్తే వినియోగదారులకు అవి జిఎస్ టి ధరలని తెలుస్తుందని, ఈ విషయాన్ని కంపెనీలకు చెప్పామని మంత్రి అన్నా రు. ఇది తప్పనిసరని, లేదంటే కఠిన చర్యలు తీసుకొంటామని అన్నా రు. ఖాతరు చేసిన వారిపై తొలుత రూ.25,000, రెం డోసారి రూ.50,000 ఆ తర్వా త రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని, అప్పటికీ మారకపోతే ఏడాది పాటు జైలుశి క్ష విధించే అవకాశ ముందని ఆయన వివరించారు. ప్రారంభ దశలో జిఎస్‌టి అమల్లో ఇబ్బందులు ఉంటాయని, అవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఫైనాన్స్, వినియోగదారుల సహా అన్ని మంత్రిత్వ శాఖలు వ్యాపారులు, వినియోగదా రుల సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పాశ్వా న్ అన్నారు. జిఎస్‌టి అమలుతో కొన్ని వస్తు వుల ధరలు పెరిగితే, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గు తాయని అన్నా రు. వినియోగదారుల ప్రయోజనం కోసం వస్తువులపై ముద్రించిన ధరలను స్పష్టం తెలియజేయాలని, వీటి గురించి ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని పాశ్వాన్ అన్నారు.

మాల్స్, విమానాశ్రయాలు, హోటళ్లు వంటి ప్రాంతా ల్లో ఉత్పత్తులపై అధిక ధరలను వసూలు చేయడం, ద్వం ద్వ ధరల విధానాన్ని అవలంభించడం చేస్తే నిషేధం వి ధించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆదేశాల ప్రకా రం, 2018 జనవరి 1 నుంచి ప్రధాన ప్రాంతాల్లో శీతల పానియాలు, అల్హాహారాలు, నీటి బాటిళ్ల ధరలు వేర్వురు గా ఉండకూడదు. ఈ విధానానికి కంపెనీలకు అనుమతి ఉండదు. ఎల్‌ఎంఒ(లీగల్ మెట్రాలజి ఆఫ్ మహారాష్ట్ర) వి భాగం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది. మాల్స్, ఖరీదైన రెస్టారెం ట్లు, హోటళ్లు, విమానాశ్రయాల వద్ద అధిక ధరలను వసూలు చేస్తున్న పెద్ద కంపెనీలపై ఎల్‌ఎంఒ అభ్యంతరం వ్యక్తం చేసింది.

పన్ను శ్లాబ్‌లలో క్రమరాహిత్యాలను తొలగించాలి: వ్యాపారులు
జిఎస్‌టి కింద పన్ను శ్లాబ్‌లలో ఉన్న క్రమరాహిత్యాలను తొలగించాలని దేశవ్యాప్తంగా వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 28 శాతం శ్లాబ్ కింద ఉత్పత్తి, పన్ను సేవల విభాగాలను పునఃపరిశీలించాలని, కొత్త ప న్ను చట్టం నిబంధనలను సులభతరం చేయాలని శుక్రవా రంనాడు వ్యాపారులు కోరారు. జిఎస్‌టి అమలు చేసిన వారం రోజులు అయిన సందర్భంగా పరిస్థితులను అంచ నా వేసేందుకు సిఎఐటి(అఖిల భారత వ్యాపారుల సమా ఖ్య) సమావేశం నిర్వహించింది. జిఎస్‌టి ప్రాథమిక అం శాలు గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల రాష్ట్రాల్లో ని చిన్న పట్టణాల్లో వ్యాపారులు ఆందోళన చెందుతున్నా రు. 23 రాష్ట్రాలకు చెందిన వ్యాపార నేతలు ఈ సమా వేశానికి హాజరై.. జిఎస్‌టి సహకార కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరే విషయమై తీర్మానం చేయ గా, అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సీనియర్ అధికా రులు, వ్యా పార ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో జిఎస్‌టి కమిటీలను రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

జిఎస్‌టిపై ప్రభుత్వం రెండో మాస్టర్‌క్లాస్: జిఎస్‌టిపై సందేహాలు, గందరగోళ అంశాల గురించి స్పష్టత ఇచ్చే లక్షంలో భాగంగా ప్రభుత్వం శుక్రవారంనాడు రెండో మాస్టర్‌క్లాస్‌ను నిర్వహించింది. దాదాపు గంటపాటు ఉండే ఈ మాస్టర్‌క్లాస్.. ఆరు రోజులపాటు నిర్వహించనున్నారు. జిఎస్‌టిలో ఇన్‌వాయిస్ పెంపు, అలాగే అనుసరించేందుకు వ్యాపారవేత్తలకు ఎలాంటి ప్రొఫార్మా లేదని రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ అధియా అన్నారు. ఇన్‌వాయిస్‌లో వివరాలను పొందుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిలో వ్యాపారానికి చెందిన జిఎస్‌టిఐఎన్ (జిఎస్‌టి గుర్తింపు సంఖ్య), సిజిఎస్‌టి (కేంద్ర జిఎస్‌టి)తో బిల్లు నగదు, ఎస్‌జిఎస్‌టి (రాష్ట్ర జిఎస్‌టి) వంటి వాటితో స్పష్టంగా విభజించారు.

విద్యపై జిఎస్‌టి ప్రభావం ఉండదు
జిఎస్‌టితో విద్య మరింత చౌక కానుందని, స్కూలు బ్యాగులు వంటి వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. విద్యా సంస్థలు, బోధన సిబ్బంది సేవలను మినహాయించామని ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యపై పన్ను విధానాలపై మార్పులేమీ ఉండవని వెల్లడించింది.

Comments

comments

Related Stories: