హరిత దళాలు

హరితహారంలో మొక్కలు నాటడానికి, కాపాడడానికి ఎక్కడికక్కడ ్రగ్రీన్‌‌రబ్రిగేడ్ల ఏర్పాటుకు సిఎం కెసిఆర్ ఆదేశం  హైదరాబాద్ : మూడో విడత హరితహారం కార్య క్రమాన్ని విజయవంతం చేయాల ని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని రక్షించడానికి అధిక ప్రా ధాన్యం ఇవ్వాలని సిఎం కోరా రు. మొక్కలను నాటడం, రక్షిం చడం కోసం ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడో విడత హరి తహారంపై బుధవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ […]

హరితహారంలో మొక్కలు నాటడానికి, కాపాడడానికి ఎక్కడికక్కడ ్రగ్రీన్‌‌రబ్రిగేడ్ల ఏర్పాటుకు సిఎం కెసిఆర్ ఆదేశం 

హైదరాబాద్ : మూడో విడత హరితహారం కార్య క్రమాన్ని విజయవంతం చేయాల ని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని రక్షించడానికి అధిక ప్రా ధాన్యం ఇవ్వాలని సిఎం కోరా రు. మొక్కలను నాటడం, రక్షిం చడం కోసం ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడో విడత హరి తహారంపై బుధవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించినట్లు సిఎం కార్యాల యం ఒక ప్రకటనలో తెలిపింది. “కరీంనగర్ పట్టణంలో మూడో విడత హరితహారం కార్య క్రమం కింద మొత్తం లక్ష మొక్కలు నాటుతారు. మొదటి రోజు 25వేలు, తరువాత రోజున 5 వేల మొక్కల చొప్పున 75 వేల మొక్కల ను 15 రోజుల పాటు నాటుతారు. ఏకకాలంలో మొక్కలు నాటడా నికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలి. గుంతలు తీయడం, ట్రీ గార్డులు ఏర్పా టు చేయడం, మొక్కలు నాటడానికి అవసరమైన 25 వేల మందిని సమీకరిం చడం కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటే సమయానికి మసీదులలో సైరన్ మోగే ఏర్పాట్లు చేయాలి. సైరన్ మోగగానే మొక్కలు నాటాలి. కరీంనగర్ పట్టణంలో 50 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్‌కు ఒక అధికారి లేదా ప్రజా ప్రతినిధిని బ్రిగేడియర్ గా పెట్టాలి. ప్రతి డివిజన్‌లో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్‌లను తయారు చేయాలి” అని సిఎం సూచించారు. “రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రీన్ బ్రిగేడ్‌లు తయారు చేయాలి. ఎక్కడికక్కడ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో బ్రిగేడ్ ఏర్ప డాలి. సీనియర్ అధికారి లేదాప్రజా ప్రతినిధి బ్రిగేడియర్‌గా వ్యవహ రించాలి. మొక్కలు నాటడం, దానికి ట్రీ గార్డు పెట్టడం, వర్షాలు తక్కువ గా ఉన్నప్పుడు, ఎండాకాలంలో వాటికి నీళ్లు పోయడం, దానికోసం నీటి ట్యాంకర్లను సమకూర్చుకోవడం లాంటి పనులన్నీ చేయాలి. మొక్కలు ఎంత ముఖ్యమో వాటిని రక్షించడం కూడా అంతే ముఖ్యమని భావిం చాలి” అని సిఎం చెప్పారు. అయితే మొదటి రోజు సిఎం లాంఛనంగా మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Related Stories: