వ్యవసాయ శాఖలో అవినీతి సాగు

ఖమ్మం వ్యవసాయ శాఖలో అవినీతి సాగు జరుగుతున్నట్టుతెలుస్తోంది. అధికారులు మారుతున్నా పని తీరు మాత్రం మారని వైనం కనిపిస్తోంది. రసాయనిక ఎరువులు, యంత్రపరికరాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణవినిపిస్తోంది. ఓ మండలాధికారి తప్పు చేశారని ఉన్నతాధికారులతోపాటు స్వయానా మంత్రికి విన్నవించడం చర్చనీయాంశమైంది. అయితే తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తికేశిక్ష విధించడం ఆ శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతికితార్కాణంగా నిలుస్తోంది. పరిస్థితిని మంత్రికి విన్నవించినందుకే ఓ అధికారిణి సెలవుపై వెళ్లిన తీరు చర్చనీయాంశంగామారింది. నాలుగైదు ఏళ్లుగా అవినీతి ఆరోపణలు […]

ఖమ్మం వ్యవసాయ శాఖలో అవినీతి సాగు జరుగుతున్నట్టుతెలుస్తోంది. అధికారులు మారుతున్నా పని తీరు మాత్రం మారని వైనం కనిపిస్తోంది. రసాయనిక ఎరువులు, యంత్రపరికరాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణవినిపిస్తోంది. ఓ మండలాధికారి తప్పు చేశారని ఉన్నతాధికారులతోపాటు స్వయానా మంత్రికి విన్నవించడం చర్చనీయాంశమైంది. అయితే తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తికేశిక్ష విధించడం ఆ శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతికితార్కాణంగా నిలుస్తోంది. పరిస్థితిని మంత్రికి విన్నవించినందుకే ఓ అధికారిణి సెలవుపై వెళ్లిన తీరు చర్చనీయాంశంగామారింది. నాలుగైదు ఏళ్లుగా అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వ్యవసాయశాఖ ప్రక్షాళణకు ఉన్నతాధికారులుపూనుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

                           

ఖమ్మం ప్రతినిధి: వ్యవసాయ శాఖద్వారా పంపిణీ చేసే సబ్సిడీ ట్రాక్టర్లు, రసాయనిక ఎరువులకు సంబంధించి భారీ అవినీతి చోటు చేసుకుంటుంది.
సబ్సిడీ పెద్ద మొత్తంలో ఉండడంతో ట్రాక్టర్లు పొందేందుకు రైతులు పోటీపడటం కొందరు అవినీతి అధికారులకు వరంగా మారింది. సబ్సిడీలో సగం చెల్లించాలన్నడిమాండ్‌తో మొదలై వివిధ రకాలుగా బేరాలకు దిగుతూతాము అనుకున్న వారికే ట్రాక్టర్లు ఇప్పిస్తున్నారు. దీనిపైగతంలోనూ విమర్శలు వచ్చాయి. మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ఒకరిద్దరు ప్రైవేటు వ్యక్తులతోకలిసి ఓ అధికారి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలువచ్చాయి.

అంతే కాదు రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జింకును ప్రైవేటు వ్యాపారుల ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుందన్న ఆరోపణలువచ్చాయి. కొందరు మండల వ్యవసాయాధికారులైతేసబ్సిడీ పై వచ్చే ఎరువులు, ఇతరత్రా వాటిని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు మార్కెట్‌కు తరలిస్తున్నారు. సబ్సిడీలపై భారీ ప్రచారం నిర్వహించిరైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులే ఆ సబ్సిడీని కాజేస్తున్న నేపథ్యంలో కూసుమంచిలో జింక్వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం రైతులకు అందించాలని సబ్సిడీపై ప్రభుత్వంపంపిన జింకును రైతులకు అప్పగించకుండా ఓ ప్రైవేటు గోడౌన్‌లో నిల్వ చేశాయి. పెద్దమొత్తంలో విక్రయించారు.

కూసుమంచి మండలానికి సబ్సిడీపై ఇచ్చిన జింకు మాత్రమేకాకుండా ఇతర మండలాలకు వచ్చిన జింకును సైతం కూసుమంచిలోనే విక్రయించినట్లుఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏడిఏ వసూళ్లు జింక్ వ్యవహారాన్ని మంత్రి తుమ్మలనాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఈ విషయాన్ని పరిశీలించాలని జిల్లాఅధికారులను ఆదేశించారు. సినిమా కథ మాదిరిగా అసలు అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకితెచ్చిన అధికారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లిందో లేదోతెలియదు కానీ జిల్లా అధికారి మాత్రం పాలేరు ఏడిఏను సెలవుపై వెళ్లాలని ఆదేశించారు.వైరాకు చెందిన ఓ అధికారిచే పాక్షిక విచారణ జరిపించి తూతూ మంత్రంగా కేసులుముగించారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు జిల్లా వ్యాప్తంగా ఈ జింక్ వ్యవహారం వెలుగుచూస్తుందన్న ఆందోళన కూడా వ్యవసాయాధికారుల్లో కలుగడంతో అందరూ కలిసి ఏడిపైచర్యలు తీసుకునేలా ప్రోత్సహించారు. మొత్తానికి అసలు అవినీతి పాల్పడిన వారి ముకుమ్మడిగాఒత్తిడి తేవడం ద్వారా ఓ అధికారి సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. దీని వెనుక పాలేరు పోస్టింగ్ పైకన్నెసిన మరో అధికారిగా ఉండి చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. కూసుమంచి వ్యవహారంలోఅధికార పార్టీ నేతలు అక్కడి అధికారికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. కొందరుతమ పంతం నెగ్గించుకునేందుకు ఏడిపై చర్యలకు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలోమంత్రి తుమ్మల పూర్తి స్థాయి విచారణ జరిపించి అసలు అవినీతి కారకులపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి రైతాంగం డిమాండ్ చేస్తుంది.

Comments

comments

Related Stories: