రాష్ట్రంలో 18వేల పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు

ఆమోదం తెలిపిన కేబినెట్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వికారాబాద్: రాష్ట్రంలో కొత్తగా 18వేల కానిస్టేబుళ్ల పోస్టుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు యాదవరె డ్డి, బి.సంజీవరావు, కె.యాదయ్యతో కలిసి ఏర్పా టు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8వేల పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని […]

ఆమోదం తెలిపిన కేబినెట్
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
వికారాబాద్: రాష్ట్రంలో కొత్తగా 18వేల కానిస్టేబుళ్ల పోస్టుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు యాదవరె డ్డి, బి.సంజీవరావు, కె.యాదయ్యతో కలిసి ఏర్పా టు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8వేల పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మూడేళ్ల కాలంలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నా రు. బతుకమ్మ, రంజాన్, బక్రీద్, వినాయక చవితి పండుగలు సజావుగా జరగడంలో పోలీసుల పా త్ర అభినందనీయమని చెప్పారు. తెలంగాణ పోలీ సులు పనితీరు చాలా బాగుందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ పథకం కింద చెరు వుల పునరుద్ధ్దరించడంలో పోలీస్ అధికారులు చెరువులను దత్తత తీసుకున్నారని కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో బస్తీల్లో జాబ్‌మేళా, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నూతన వాహనాలను అం దించినట్లు తెలిపారు. బషీరాబాద్‌లో రూ.80 ల క్షలు, వికారాబాద్‌లో రూ.70 లక్షలతో మహిళా పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించినట్లు పేర్కొ న్నారు. 11వేల పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నట్లు, ఏడాది కాలంలో శిక్షణ పూర్తి అవుతుందన్నారు. అదేవిధంగా 2, 3 రోజుల్లో ఎస్‌ఐలకు శి క్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మూడేళ్లవుతున్నా నేటికీ తెలంగాణ ఉద్య మకారులపై నమోదు చేసిన కేసులు పూర్తిగా రద్దు కాలేవని విలేకరులు ప్రశ్నించగా, ఉద్యమకారుల పై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 10,500 కేసులు రద్దు చేశామని, ఇంకా మిగిలిన కేసులకు సంబంధించిన ఫైళ్లు ఐజి కార్యాలయం లో ఉన్నాయని తెలిపారు. త్వరలో వాటిని కూడా రద్దు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అ మరులైన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు చెప్పా రు. ఈ సమావేశంలో పోలీస్ హౌసింగ్ కార్పొ రేషన్ ఎండి మల్లారెడ్డి, హైదరాబాద్ రేంజ్ ఐజి స్టీఫేన్ రవీంద్ర, ఎస్‌పి అన్నపూర్ణ, మహిళా పిఎస్ సిఐ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మికులతో స్వాగతం: హోంమంత్రి నా యిని నర్సింహారెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారం భోత్సవానికి రాగా, తమిడిబాజాతో పాటు బ్యాం డ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే బ్యాండ్ వాయించే ఆరుగురు బృందంలో ముగ్గురు బాల కార్మికులు ఉన్నారు. హోం, కార్మికశాఖ మంత్రి ప్రారంభోత్సవంలో బాల కార్మికులు ఉండడంతో పలువురు విమర్శలు గుప్పించారు.

Comments

comments

Related Stories: