పెళ్లికి ముందే గర్భం.. మరోకరితో పెళ్లి

మాండ్య: ప్రేమ పేరుతో వంచించబడిన ఆ యువతి ప్రియుడి కారణంగా గర్భం దాల్చింది. అనంతరం ఆ ప్రియుడు ముఖం చాటేయడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. దాంతో వారు ఇటీవలే వేరే యువకుడితో వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత నవ వధువులో వచ్చిన శారీరక మార్పులపై వరుడు ఆరా తీయగా యువతి 8 నెలల గర్భిణీ అని తేలింది. దీంతో ప్రియుడి వంచన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జరిగింది. […]

మాండ్య: ప్రేమ పేరుతో వంచించబడిన ఆ యువతి ప్రియుడి కారణంగా గర్భం దాల్చింది. అనంతరం ఆ ప్రియుడు ముఖం చాటేయడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. దాంతో వారు ఇటీవలే వేరే యువకుడితో వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత నవ వధువులో వచ్చిన శారీరక మార్పులపై వరుడు ఆరా తీయగా యువతి 8 నెలల గర్భిణీ అని తేలింది. దీంతో ప్రియుడి వంచన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే… స్థానిక నాగమంగళ మండలంలోని బిండేనహళ్లిలో ఉండే యువతికి మాండ్యలోని దొడ్డగడరుడనహళ్లికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దాంతో వారిద్దరీ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో యువకుడు, యువతికి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. దాంతో యువతి తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది.

కాని అతడు ముఖం చాటేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు భయపడి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో వారు ఈ నెల 8న మరో యువకుడితో పెళ్లి జరిపించారు. అయితే యువతిలో వచ్చిన శారీరక మార్పులపై వరుడికి అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎనిమిది నెలల గర్భవతి అని తేలింది. దాంతో యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి గురించి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments

Related Stories: