కామర్స్ డిగ్రీ తర్వాత కోర్సులు

కామర్స్‌తో డిగ్రీ, ఇంటర్ పూర్తి చేశాక ఉన్నత విద్యావకాశాలు విస్తృతంగా ఉన్నాయి. డిగ్రీలో మ్యాథ్స్(ఐచ్చికం), బిజినెస్ స్టడీస్, ఎకౌంట్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ (తప్పనిసరి సబ్జెక్టుగా) చదివినవారికి కెరీర్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి… చార్టర్డ్ ఎకౌంటెన్సీ ఆర్థికంగా సూచనలు చేయడం, లావాదేవీలు చూడడం, వ్యక్తిగత, కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గూర్చి సలహాలు, సూచనలు చేయడం వంటివి చార్టర్డ్ ఎకౌంటెంట్(సిఎ) వృత్తిలో భాగం. ఈ వృత్తిలో ఆర్థిక రికార్డులు రాయడం అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్, టాక్సేషన్, ఫోరెన్సిక్ […]

కామర్స్‌తో డిగ్రీ, ఇంటర్ పూర్తి చేశాక ఉన్నత విద్యావకాశాలు విస్తృతంగా ఉన్నాయి. డిగ్రీలో మ్యాథ్స్(ఐచ్చికం), బిజినెస్ స్టడీస్, ఎకౌంట్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ (తప్పనిసరి సబ్జెక్టుగా) చదివినవారికి కెరీర్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి…

చార్టర్డ్ ఎకౌంటెన్సీ
ఆర్థికంగా సూచనలు చేయడం, లావాదేవీలు చూడడం, వ్యక్తిగత, కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గూర్చి సలహాలు, సూచనలు చేయడం వంటివి చార్టర్డ్ ఎకౌంటెంట్(సిఎ) వృత్తిలో భాగం. ఈ వృత్తిలో ఆర్థిక రికార్డులు రాయడం అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్, టాక్సేషన్, ఫోరెన్సిక్ ఎకౌంటింగ్, కార్పోరేట్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ, బిజినెస్ రికవరీ వంటి సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తికాగానే ఉన్నతమైన జీతంతో ఉద్యోగావకాశాలున్నాయి. అయితే చదువుపై అధిక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణతో కూడిన శ్రమ చేయాలి. సంఖ్యలను గుర్తుంచుకోవడం అవసరం. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ‘సిపిటి’ పాస్ అయితే ఫౌండేషన్ కోర్సుకు అప్లై చేసుకోని తొమ్మిది నెలల శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంటర్ పూర్తికాగానే ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు. ఇక రెండో స్థాయిలో ఇంటర్‌మీడియట్ కోర్సు. పన్నెండు నెలల థియరీ పార్టు పూర్తికాగానే, పరీక్షలు రాయాలి. దీన్లో తప్పకుండా కోర్సుకు సంబంధించిన ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ కావాలి. మూడు వారాల ‘ఐసిఐటిఎస్‌ఎస్’ పూర్తికాగానే ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. దాని తర్వాత చివరిపరీక్ష కోసం ‘ఐసిఏఐ’ లో పేరు నమోదుచేసుకోవాలి. ఇవన్నీ పూర్తిచేశాక సిఏగా వ్యక్తిగతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టుకోవచ్చు లేదా వ్యాపారసంస్థల్లో, కన్సల్టెన్సీలలో పనిచేయవచ్చు. ప్రస్తుతం చాలా సంస్థలు సిఏలకు అధిక జీతాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్
కంపెనీ సెక్రెటరీ వృత్తి కేవలం గౌరవప్రదమైనదే కాకుండా వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తుంది. కార్పోరేట్ లా, సెక్యూరిటీ లా, క్యాపిటల్ మార్కెట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ముఖ్య సలహాదారుగా, కంపెనీకి సంబంధించిన రెగ్యుటేటరీ వ్యవస్థకు బాధ్యత వహంచడం, కార్పోరేట్ ప్లానర్, స్ట్రాటజిక్ మేనేజర్‌గా ఈ వృత్తిలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటర్ పూర్తికాగానే కంపెనీ సెక్రెటరీ కోర్సులో చేరాలనుకునే విద్యార్థి మూడు దశల్లో చదువు పూర్తిచేయాల్సి ఉంటుంది. అవి ఫౌండేషన్ ప్రోగ్రాం, ఎక్జిక్యూటివ్ ప్రోగ్రాం, ప్రొఫెషనల్ ప్రోగ్రాం లు. దీన్లో భాగంగా విద్యార్థులు 15 నెలల ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ సెక్రెటరీ కోర్సు తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలంటే గుర్తించబడిన యూనివర్సిటీ నుంచి పిహచ్‌డి కోర్సు, ఐసిఎస్‌ఐ నిర్వహించే పోస్ట్ మెంబర్‌షిప్ క్వాలిఫికేషన్(పిఎమ్‌క్యూ) కోర్సు చేసుకోవచ్చు.
కంప్యూటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్
కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సబ్జెక్టు ఇంటర్, డిగ్రీల్లో చదివుంటే ఈ కోర్సు మీకు సరిపోతుంది. డిజైన్‌కు సంబంధించిన సబ్జెక్టును ఈ ప్రోగ్రాములో నేర్పిస్తారు. టెలీకమ్యూనికేషన్స్ ప్లానింగ్ కు సంబంధించిన కాన్సెప్టులను తెలుసుకోవడం, ఆర్గనైజేషనల్ బిహేవియర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, డాటాబేస్ డిజైన్ కూడా ఈ కోర్సులో భాగమే. హై స్కూల్ డిప్లొమా లేదా జిఇడి సర్టిఫికేషన్ అనేవి ఈ కోర్సులో చేరడానికి అర్హతలు. విద్యార్థులు దీని తర్వాత బిసిఎ చదివి, ఉన్నత విద్య కావాలనుకునేవారు ఎమ్‌సిఎమ్ లేదా ఎమ్‌సిఎ కూడా చేయవచ్చు.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
వివిధ రకాల మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు పొందే వీలున్న సబ్జెక్టు బిజినెస్ అడ్మినస్ట్రేషన్. వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బిజినెస్ అడ్మినిస్ట్రేట్లను కోరుకుంటున్నాయి నేడు. ఈ వృత్తిని కోరుకునేవారు బిబిఎ, ఎమ్‌బిఎ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు కామర్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఎమ్‌బిఎ కోర్సు చేయొచ్చు. పోటీతో కూడిన కార్పొరేట్ వ్యవస్థలో నేడు ఎమ్‌బిఎ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఇది ఒక్క ఫైనాన్స్‌కే కాకుండా హ్యూమన్ రిసోర్స్, కన్సల్టెన్సీ, ఐటి లకు సంబంధించిన విభాగాలు కూడా ఎమ్‌బిఎలో చదివే అవకాశం ఉంది.
రీసెర్చ్, బోధన
విద్యాపరంగా ఆసక్తి ఉన్నవారు ఈ దారిని ఎంచుకోవచ్చు. డిగ్రీలో బికాం, బిఎ మ్యాథ్స్, బిఎ ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులను తీసుకుంటే అవే సబ్జెక్టులతో ఎమ్‌కామ్, ఎమ్‌ఎ మాస్టర్స్ చేయవచ్చు. తర్వాత ఎమ్‌ఫిల్ లేదా పిహెచ్‌డి లతో రీసెర్చ్ లేదా లెక్చరర్‌గా ఉద్యోగం చేయాలంటే బిఇడి, ఎమ్‌ఇడి, యుజిసి-నెట్ కోర్సులు చేయాల్సి ఉంటుంది.
డిఫెన్స్ సర్వీసులు
ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలలో చేరే అవకాశం బికాం డిగ్రీ తర్వాత ఉంది. అయితే బికాం డిగ్రీతోని నాన్ టెక్నికల్ ఉద్యోగాలు మాత్రమే పొందగలరు.
బికాం తర్వాత ఉన్నత విద్య
ఎల్‌ఎల్‌బి(ఇంటిగ్రేటెడ్) చేసి ‘లా’ ను వృత్తిగా చేసుకోవచ్చు. తర్వాత ఎల్‌ఎల్‌ఎమ్ కూడా చేయొచ్చు. బ్యాంక్, ఇన్షూరెన్స్ డెవలప్‌మెంట్ ఆఫిసర్లుగా ఉద్యోగం పొందవచ్చు( సంబంధిత పరీక్షలు రాయాల్సి ఉంటుంది). యుపిఎస్‌సి, రాష్ట్రాలకు సంబంధించిన సర్వీస్ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు.