బోపన్న జోడీకి మిక్స్‌డ్ టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో బోపన్న మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుని రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ రోహన్ బోపన్న (భారత్), గాబ్రియెలా డబ్రోస్కి (కెనడా) విజయం సాధించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో బోపన్న జోడీ 2-6, 6-2, 12-10 తేడాతో గ్రొయెన్ ఫీల్డ్ (జర్మనీ), […]

ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో బోపన్న మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుని రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ రోహన్ బోపన్న (భారత్), గాబ్రియెలా డబ్రోస్కి (కెనడా) విజయం సాధించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో బోపన్న జోడీ 2-6, 6-2, 12-10 తేడాతో గ్రొయెన్ ఫీల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా(కొలంబియా) జంటను ఓడించింది. తొలి సెట్‌లో బోపన్న జంటకు చుక్కెదురైంది. ఏకపక్షంగా సాగిన మొదటి సెట్‌లో ప్రత్యర్థి జంట సునాయాస విజయంతో పైచేయి సాధించింది. బోపన్న జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఈ జంట సులువుగా తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే కీలకమైన రెండో సెట్‌లో బోపన్న జోడీ పుంజుకుంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. ప్రత్యర్థి జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఇండో-కెనడా జోడీ 6-2 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం పోరు యుద్ధాన్ని తలపించింది. రెండు జోడీలు కూడా విజయం కోసం సర్వం ఒడ్డాయి. దీంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అంతేగాక, ఫలితం తరచు చేతులు మారుతూ వచ్చింది. కానీ, చివర్లో ప్రత్యర్థి జంట ఒత్తిడిని తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బోపన్న జోగీ 12-10 తేడాతో సెట్‌ను గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, బోపన్న కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ టైటిల్ కావడం విశేషం.
ఫైనల్లో ఒస్టాపెంకో
కాగా, మహిళల సింగిల్స్ లాత్వియ సంచలనం, అన్‌సీడెడ్ జలెనా ఒస్టాపెంకో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఒస్టాపెంకో 7-6, 3-6, 6-2 తేడాతో ౩౦వ సీడ్ టీమియా బసిన్‌జ్కి(స్విట్జర్లాండ్)ను ఓడించింది. ప్రారంభం నుంచే పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో తొలి సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకున్న ఒస్టాపెంకో సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ, రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి క్రీడాకారిణి చెలరేగి ఆడింది. ఒస్టాపెంకోను హడలెత్తించిన బసిన్‌జ్కి 6-3 తేడాతో సెట్ కైవసం చేసుకుది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ఒస్టాపెంకో మళ్లీ పుంజుకుంది. ప్రత్యర్థిని హడలెత్తిస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో 6-2 తేడాతో సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదిలావుండగా, ఓ లాత్వియా క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆండీ ముర్రే సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ముర్రే 2-6, 6-1, 7-6, 6-1 తేడాతో జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ నిషికొరిని ఓడించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన ముర్రే తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ముర్రే స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకాను ఎదుర్కొంటాడు. మరో సెమీఫైనల్లో తొమ్మిది సార్ల ఛాంపియన్ రఫెల్ నాదల్ ఆస్ట్రియా సంచలనం డొమినిక్ థీమ్‌తో తలపడుతాడు. కాగా, ఫైనల్లో నాదల్, ముర్రే తలపడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

Related Stories: