యుపి సిఎం సొంత సేన!

ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ(బిజెపి)కి, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హిందూ యువవాహినికి మధ్య అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి. ఇరుపాలక వర్గాలకు మధ్య పొర పొచ్చాల వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల ఇవి చోటు చేసు కున్నాయి. ఈ ఉద్రిక్తతలను చల్లార్చడానికి హిందూ యువవాహిని సీనియర్ కార్యనిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ బిజెపి కలిసిరావటం లేదు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సేనపై అనుమానాలు తీవ్రమైనాయి. హిందూ యువవాహిని దూకుడువల్ల తమ పార్టీవారికి అధికారంలో ఉన్నామన్న ఉత్సాహమే కలగడంలేదని బిజెపివారు అంటున్నారు. తాజా ఘర్షణ […]

ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ(బిజెపి)కి, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హిందూ యువవాహినికి మధ్య అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి. ఇరుపాలక వర్గాలకు మధ్య పొర పొచ్చాల వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల ఇవి చోటు చేసు కున్నాయి. ఈ ఉద్రిక్తతలను చల్లార్చడానికి హిందూ యువవాహిని సీనియర్ కార్యనిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ బిజెపి కలిసిరావటం లేదు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సేనపై అనుమానాలు తీవ్రమైనాయి. హిందూ యువవాహిని దూకుడువల్ల తమ పార్టీవారికి అధికారంలో ఉన్నామన్న ఉత్సాహమే కలగడంలేదని బిజెపివారు అంటున్నారు.
తాజా ఘర్షణ గతనెల 28వ తేదీన గోండాలో చోటు చేసుకుంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌సింగ్ వాహనాన్ని బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేసి, డ్రైవర్‌ను కొట్టారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఆ నగరానికి మొదటిసారిగా వచ్చిన ఆదిత్యనాథ్‌కు స్వాగతం పలకడంకోసం సింగ్ కారులోంచి రావడంతో ఆ దాడి నుంచి తప్పించుకోగలిగారు. ఆరు రోజుల ముందు మే 22న బిజెపి, హిందూ యువవాహిని కార్యకర్తల మధ్య కన్నౌజ్‌లో ఘర్షణ జరిగింది. గంగా మైదానం వెంబడి ఇసుక గనులపై నియంత్రణ విషయమై ఇరువర్గాలు ఘర్షణపడ్డాయి. పరస్పరం రాళ్లు విసురు కోవడంతోపాటు చివరకు కాల్పులు కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
పార్టీ సమావేశంలో పతాకాలను ఆవిష్కరించబోగా తమకు ప్రతిఘటన ఎదురైనట్లు పేరు చెప్పడానికి ఇష్టంలేని బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. ఆదిత్యనాథ్ బిజెపి కార్యకర్తల సభలో ప్రసంగించే చోట కూడా పార్టీ పతాకాలు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రతి చోటా హిందూ యువవాహినికి చెందిన కాషాయ పతాకాలే దర్శన మిచ్చినట్లు తెలిపారు. ఎంతో ప్రతిఘటన తర్వాత మాత్రమే బిజెపి జెండాలను సభాస్థలి వద్ద ఉంచగలిగామన్నారు. అంతకు ముందు బస్తీలో బిజెపి సమావేశ స్థలి వద్ద పార్టీ పతాకాలను ఎగుర వేయడానికి ప్రయత్నించగా హిందూ యువవాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సభలో కూడా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాగానే ఈ విషయమై బిజెపి వారు గట్టిగా నిరసన తెలిపారు.
అధికార పార్టీ బిజెపి, యువవాహిని మధ్య ఉద్రిక్తతలు లేవని హిందూ యువవాహిని ప్రధాన కార్యదర్శి పికె మాల్ చెప్పారు. తాము చాలా సయోధ్యతో మెలగుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను పటిష్టపర్చడమే లక్షంగా కలిసి సాగుతున్నామని కూడా చెప్పారు. అయితే రెండు వర్గాల్లోని స్వార్థపరులే అక్కడక్కడ జరిగిన ఘర్షణలకు కారణమని వివరించారు. మాల్ వివరణతో నిమిత్తం లేకుండా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
హిందూ యువ వాహిని తమది సాంస్కృతిక సంస్థగా పేర్కొన్నా, రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా దాని చేతల్లో కనపడుతున్నాయి. ఆదిత్య నాథ్ ముఖ్యమంత్రి కావడంతో వారి రాజకీయ కదలికలు జోరందు కున్నాయి. అసెంబ్లీలో తాను సారథిగా ఉన్న పార్టీ కంటే తన వ్యక్తిగత సంస్థే ముఖ్యమన్నట్లు ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్నారని బిజెపి ఆరోపి స్తోంది. మేలో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ప్రసంగిస్తూ ప్రభుత్వంలో బయటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను గట్టిగా విమర్శించారు.
ఇంతకు ముందు హిందూ యువవాహిని కార్యకలాపాలు గోరఖ్‌పూర్ ప్రాంతానికి, చుట్టు పక్కల జిల్లాలకే పరిమితమయ్యాయి. అయితే ఆదిత్యనాథ్ అధికారం చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ సభ్యత్వాలను విపరీతంగా పెంచారు. ఈ పరిణామాన్ని బిజెపి ఆందోళనతో చూడడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. ఆ రెండు వర్గాల మధ్య భేదభావాలు ఘర్షణలకు దారితీయని చోట్ల కూడా ఉద్రిక్తత ఉంది. హిందూ యువవాహిని అంబేద్కర్ నగర్ శాఖ అధ్యక్షుడు చేసిన ఓ కీలక ప్రకటన బిజెపి వారిని తీవ్రంగా వ్యాకుల పెడుతోంది. అదేమిటంటే – సామాన్యులు తమ సమస్యల పరిష్కారా నికి యువవాహినిని ఆశ్రయిస్తున్నారని. విశ్వహిందూపరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కొందరు యువవాహిని సభ్యత్వానికి ఎగబడుతున్నారు.
సభ్యత్వ స్తంభన తొలగిన నాడు వారికే తొలి ప్రాధాన్యం ఇస్తా మని కూడా వాహిని నాయకులు అంటున్నారు. వచ్చే ఆరునెలల పాటు కొత్త సభ్యులను చేర్చుకోవడాన్ని యువవాహిని ప్రధాన కార్య దర్శి పికె మాల్ గత నెల 3న నిలిపివేశారు. ఈ నిలిపివేతను ఏడాది పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. అంతకు ముందు రోజే ఆదిత్య నాథ్‌ను మౌర్య విమర్శించారు. బిజెపి రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగింపు రోజున ఆయన విమర్శలు చేశారు. ఆ రోజున సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యారు. ఆ విమర్శలకు రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆమోద ముద్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్యనాథ్ తన హిందూ యువ వాహినిని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకొంటోంది.
యువ వాహిని సంఘ్ పరివార్‌లో లేదు. అది ఆర్‌ఎస్‌ఎస్‌కు బయటి సంస్థ. ఆదిత్యనాథ్ సొంత సంస్థ సమాంతర హిందూత్వ సంస్థగా ఎదుగుతుందన్నది ఆర్‌ఎస్‌ఎస్ భయం. హిందూ యువతతో కూడిన తీవ్రవాద సంస్థ హిందూ యువవాహిని దాన్ని యోగి ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ మఠం ఆలయ అధిపతి కావడానికి ముందు 2002 ఏప్రిల్‌లో శ్రీరామ నవమి రోజున నెలకొల్పారు. అది మతపరమైన హింసాకాండను రెచ్చగొట్టిన సంస్థ. గోరఖ్‌పూర్ ప్రధాన కార్యాలయం గా గల హిందూ యువవాహిని తనను తాను ‘ఒక తీవ్రవాద సాంస్కృతిక, సామాజిక సంస్థ’గా పేర్కొంటుంది. హిందూత్వ, జాతీయ వాదం తమ లక్షాలని చాటుకొంది. హిందూ సమాజంలో పరస్పర సామరస్యం గల వర్గాలన్నిటినీ కులాలు, తెగలకు అతీతంగా ఐక్యం చేయడమే ఆశయమని చెప్పుకునే ఈ సంస్థ గోరక్షణ, లవ్ జీహాద్, ఘర్ వాపసీ కార్యక్రమాలు చురుకుగా సాగించింది.
గోరఖ్‌పూర్‌లో 2007 జనవరిలో జరిగిన అల్లర్లలో మసీదులు, ఇళ్లు, బస్సులు, రైళ్లను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. ఆ సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ అరెస్టు అయినప్పుడు హిందూ యువవాహిని తీవ్రంగా ప్రతిఘటించింది. ముంబయి వెళుతున్న గోరఖ్‌పూర్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండింటిని తగులబెట్టారు. ఇటీవల మీరట్‌లో ఒక ఇంటిలోకి చొరబడి ఒక మహిళతో ఉన్న వ్యక్తిని ఇంటి బయటకు ఈడ్చుకు వచ్చిన ఘటనలో హిందూ యువవాహిని హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.

– ధీరేంద్ర కె ఝా