నేడు బంగ్లాతో ఆస్ట్రేలియా పోరు

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో అద్భుత ఆటను కనబరిచి ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పేలవమైన ఆటను కనబరిచిన ఆస్ట్రేలియా వర్షం వల్ల ఓటమిని తప్పించుకుంది. అయితే బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీస్ రేసులో నిలువాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. కివీస్‌పై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా అంతంత మాత్రంగానే రాణించింది. అయితే కీలక సమయంలో బౌలర్లు […]

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో అద్భుత ఆటను కనబరిచి ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పేలవమైన ఆటను కనబరిచిన ఆస్ట్రేలియా వర్షం వల్ల ఓటమిని తప్పించుకుంది. అయితే బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీస్ రేసులో నిలువాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. కివీస్‌పై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా అంతంత మాత్రంగానే రాణించింది. అయితే కీలక సమయంలో బౌలర్లు విజృంభించి న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. బంగ్లా మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకే విజయవకాశాలు అధికంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కంగారూలు ఎంతో బలోపేతంగా ఉన్నారు. డేవిడ్ వార్నర్, అరొన్ ఫించ్, మాక్స్‌వెల్, స్మిత్, ట్రావిస్ హెడ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక హాజిల్‌వుడ్, స్టార్క్, పాటిన్సన్, కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ముర్తుజా నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. తమీమ్ ఇక్బాల్ అద్భుత ఫాంలో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. సౌమ్య సర్కార్, ముష్ఫికుర్ రహీం, సాకిబ్ అల్ హసన్, ఇమ్రూల్ కైస్, మహ్మదుల్లా తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. దీంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Comments

comments