హన్మకొండ ఎసిపి మురళీధర్‌కు రాష్ట్రపతి ప్రశంస

                  వరంగల్ క్రైం:హన్మకొండ ఎసిపిగా పని చేస్తున్న కటకం మురళీధర్ శనివారం రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ చేతుల మీదుగా రాష్ట్రపతి సంతకం చేసిన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో 2016లో కనబరిచిన ప్రతిభకుగానూ భారత ప్రభుత్వం ఎసిపి మురళీ ధర్‌ను ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని హైదరాబాద్ డిజిపి కా ర్యాలయంలో డిజిపి […]

                 

వరంగల్ క్రైం:హన్మకొండ ఎసిపిగా పని చేస్తున్న కటకం మురళీధర్ శనివారం రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ చేతుల మీదుగా రాష్ట్రపతి సంతకం చేసిన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో 2016లో కనబరిచిన ప్రతిభకుగానూ భారత ప్రభుత్వం ఎసిపి మురళీ ధర్‌ను ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని హైదరాబాద్ డిజిపి కా ర్యాలయంలో డిజిపి అనురాగ్‌శర్మ అందజేశారు.

ఈక్రమం లోనే ఐపియంకు సంబంధించిన పతకాన్ని రానున్న ఆగష్టు 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎసిపి మురళీ ధర్‌కు అందజేయనున్నారు. కరీంనగర్‌కు చెందిన మురళీధర్ 1989లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధుల్లో చేరి కాజిపేట, హన్మ కొండ, ములుగు, జనగాం, బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐగా పనిచేసి 2000లో సిఐగా పదోన్నతి పొంది ఎసిబి, స్పెషల్‌బ్రాంచ్‌లతోపాటు జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, భూపాలపల్లి సిఐగా పనిచేస్తూ 2011లో డిఎస్‌పిగా పదోన్నతి పొంది కౌంటర్ ఇంటలిజెన్స్, ములుగు డిఎస్‌పిగా పనిచేశారు. కాగా ఇప్పటి వరకు ఎసిపి మురళీధర్ రెండు వందలకు పైగా శాఖాపరమైన రివార్డులతోపాటు సేవాపతకం, ఉత్తమ సేవాపతకాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకోగా ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి ఐపియం అందుకున్నారు. ఈ నేపధ్యంలో ఎసిపి మురళీధర్‌ను వరంగల్ పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబు అభినందించారు.

Related Stories: