‘బినామీ’ల ఆటకట్టు!

బినామీల డీలర్లను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలు పది రోజుల్లో నివేదిక…ఆపై చర్యలు సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో బినామీ రేషన్ డీలర్లపై వేటు వేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దాదాపు 1545 రేషన్‌షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా ప్రభుత్వం వినియో గదా రులకు ప్రతి నెల నిత్యావసరవస్తువులను పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో 25 శాతం వరకు బినామీ షాపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ద్వారా రేషన్‌షాపులను పొందిన కొంతమంది […]

బినామీల డీలర్లను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలు
పది రోజుల్లో నివేదిక…ఆపై చర్యలు

సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో బినామీ రేషన్ డీలర్లపై వేటు వేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దాదాపు 1545 రేషన్‌షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా ప్రభుత్వం వినియో గదా రులకు ప్రతి నెల నిత్యావసరవస్తువులను పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో 25 శాతం వరకు బినామీ షాపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ద్వారా రేషన్‌షాపులను పొందిన కొంతమంది డీలర్లు తమకు కేటాయించిన షాపులను ఇతరులకు అప్పగించారు. సదరు డీలర్లు ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ తమ షాపులను ఇతరులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ రేషన్‌షాపులను బినామీలు నడుపుతున్నారు. పాతబస్తీలో ఒక్కో బినామీ వద్ద ఐదు నుంచి పది రేషన్ షా పులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అసలు డీలర్ల నుంచి షాపులను పొందిన బినామీలు నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యం, కిరోసిన్, చక్కెర తదితర సరుకులను బినామీలను ఆక్రమంగా నల్లా బజార్‌కు తరలించి సోమ్ము చేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బినామీ డీలర్లపై వేటు వే సేందుకు పౌరసరఫరాలశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొంది ంచింది. గత గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులతో తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశమై కేటా యించిన వ్యక్తులు కాకుండా బినామీ వ్యక్తులు నిర్వహి స్తున్న రేషన్ షాపులను గు ర్తించి చర్యలు తీసుకోవాలని ఆదే శాలు జారీ చేశారు. ఈ మేరకు రేషన్ షాపులకు సంబం ధించి అసలు వ్యక్తులెవరూ, బినామీ లెవరూ గుర్తిం చేందుకు ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్‌కు చెందిన ఐదు బృందా లకు బాధ్యతలను అప్పగిం చారు.

ఆయా బృందాలు పది రోజుల పాటు మూడు జిల్లా పరు ధుల్లో విస్తృత తనిఖీలు నిర్వ హించి బినామీ వ్యక్తుల నియంత్రణలో ఉన్న రేషన్ షాపులను గుర్తించి నివేదికను ఉన్న తాధికారులకు అంద జే స్తా యి. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు బినామీ రేషన్ డీల ర్లపై చర్యలు తీసుకో నున్నారు. అదే విధంగా మహానగరంలో దాదాపు 179 రేషన్‌షాపులు పని చేయడంలేదు. అవినీతి ఆరోపణలు ఎదు ర్కొం టూ కొంతమంది డీలర్లు సస్పెండ్ కావడం, సెలవులపై వెళ్లడం ఇతరత్రా కార ణాలతో ఆయా షాపులు పని చేయడంలేదు. దీంతో పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు ఆయా రేషన్ షాపులను పక్కనే ఉన్న షాపులకు ట్యాగాన్ చేశారు.

అయితే రెండు మూడు షాపులు ఒకే డీలర్ వద్ద ఉండటంతో తమకు సక్రమంగా సరుకులను పంపిణీ చేయడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. అలాగే వరుసగా ఆరు నెలల పాటు రేషన్ షాపుల్లో నిత్యా వసర వస్తువులు తీసుకొని వినియోగ దారులకు సంబంధించిన ఆహార భద్రత కార్డులను రద్దు చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులు యో చిస్తు న్నారు. దీనిపై పూర్తిస్ధాయిలో విచా రణ జరిపి సదరు విని యోగ దారులు అర్హులైనవారా కాదా అని తేల్చి వారి కార్డులను రద్దు చే యాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బినామీలకు చెక్ పడనుది.

Comments

comments

Related Stories: