ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సబ్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఎ.విజయమోహన్ రావు తెలిపారు. క్లరికల్ కేడర్ పోస్టుల కోసం 60 మందికి 11 నెలల పాటు, ఎన్‌ఇఇ ఎల్‌ఐటి సర్టిఫికేట్ కోసం వంద మందికి ఒక సంవత్సరం పాటు కంప్యూటర్ ఒ లెవల్ కోర్సుల్లో, ఎన్‌ఐఇఎల్‌ఐటి సర్టిఫికేట్ కోసం కంప్యూటర్ హార్డ్‌వేర్ మెయింటెనెన్స్‌లో 50 మంది సంవత్సరం […]

హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సబ్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఎ.విజయమోహన్ రావు తెలిపారు. క్లరికల్ కేడర్ పోస్టుల కోసం 60 మందికి 11 నెలల పాటు, ఎన్‌ఇఇ ఎల్‌ఐటి సర్టిఫికేట్ కోసం వంద మందికి ఒక సంవత్సరం పాటు కంప్యూటర్ ఒ లెవల్ కోర్సుల్లో, ఎన్‌ఐఇఎల్‌ఐటి సర్టిఫికేట్ కోసం కంప్యూటర్ హార్డ్‌వేర్ మెయింటెనెన్స్‌లో 50 మంది సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థికి రూ.1000 విలువైన పాఠ్యపుస్తకాలు, నెలకు రూ.500 ఉప కార వేతనం చెల్లిస్తామన్నారు.

పిఎఫ్ నియర్ యులో క్లెయిమ్‌ల పరిష్కారం: నిధి ఆప్‌కే నియత్(పిఎఫ్ నియర్ యు) కార్యక్రమంలో 33,733 క్లెయిమ్‌లను పరిష్కరించినంట్లు రీజినల్ పిఎఫ్ కమిషనర్ -1 ఎం.ఎస్.కె.వి.వి.సత్యనారాయణ తెలిపా రు. వీటిలో 10 రోజుల్లో 18,791 క్లెయిమ్‌లు, 20 రోజుల్లో 14,883 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 16190.6 లక్షలను చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ మాసానికి గాను రూ.235.11 లక్షలను రికవర్ చేశామని, అదే విధంగా 1450 ఫిర్యాదులను కూడా పరిష్కరించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Comments

comments

Related Stories: