నిశిత్ నడిపిన బెంజ్ కారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దట…?

ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ కొడుకు నిశిత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం తెల్లవారు జామున కారు యాక్సిడెంట్ తో చనిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన కారు మీదే అందరి దృష్టి పడింది. అయితే… ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కారుపై మరో న్యూస్ హల్ చల్ చేస్తున్నది…. నిశిత్ నడిపిన బెంజ్ కారు హీరో పవన్ కళ్యాణ్ దంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయ్. […]

ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ కొడుకు నిశిత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం తెల్లవారు జామున కారు యాక్సిడెంట్ తో చనిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన కారు మీదే అందరి దృష్టి పడింది. అయితే… ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కారుపై మరో న్యూస్ హల్ చల్ చేస్తున్నది….

నిశిత్ నడిపిన బెంజ్ కారు హీరో పవన్ కళ్యాణ్ దంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయ్. మరి.. ఆ కారు పవన్ కళ్యాణ్ దైతే… మంత్రి నారాయణ దగ్గరకు ఎలా వచ్చింది? అనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

2016 లో తనకు ఎంతో ఇష్టమైన ఈ కారును మంత్రి నారాయణ కు పవన్ కళ్యాణ్ అమ్మేశాడట. పవన్ కళ్యాణ్ కు నిశిత్ వీరాభిమాని అట. అందుకే… తన అభిమాన హీరో నడిపిన కారు తనకు కావాలంటూ నిశిత్ మంత్రి నారాయణ పై ఒత్తిడి తీసుకొచ్చాడట.

పవన్ కళ్యాణ్ కు తన ఇష్టమైన కారును అమ్మడం ఇష్టం లేకున్నా… మంత్రి నారాయణ తన కొడుకు కోసం చాలా సార్లు రిక్వెస్ట్ చేయడంతో వాళ్లకు అమ్మేశాడట పవన్.

ఈ న్యూసే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే.. చాలా మంది ఇది పవన్ కళ్యాణ్ కారు కాదని… ఇది చిరంజీవి కారని అంటున్నారు. లేదు… పవన్ కళ్యాణ్ కారు వేరు.. ఈ కారు వేరు. అచ్చం పవన్ కళ్యాణ్ లాంటి కారునే మంత్రి నారాయణ తన కొడుకు కోసం కొన్నాడని కొంతమంది వాదిస్తున్నా…ఏ వార్త నిజానిజాలు మాత్రం తెలియట్లేదు.

Comments

comments

Related Stories: