‘వంద’నానికి భారీ భద్రత

రేపటి ఒయు శతాబ్ది సంబరాల ప్రారంభోత్సవానికి 3500 మందితో బందోబస్తు ఉస్మానియా యూనివర్సిటీ : ఆసక్తితో ఎదురు చూస్తున్న ఉస్మానియా విశ్వ విద్యాలయం వందేళ్ల పండుగను ఈనెల 26వ తేదీ (బుధవారం)న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. ఈ మహోత్సవానికి 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. యూని వర్శిటీ సిడిఇ ఆడిటోరియంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆయన పోలీసు అధికారుల తో సమావేశమయారు. సాయంత్రం […]

  • రేపటి ఒయు శతాబ్ది సంబరాల ప్రారంభోత్సవానికి 3500 మందితో బందోబస్తు

ఉస్మానియా యూనివర్సిటీ : ఆసక్తితో ఎదురు చూస్తున్న ఉస్మానియా విశ్వ విద్యాలయం వందేళ్ల పండుగను ఈనెల 26వ తేదీ (బుధవారం)న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. ఈ మహోత్సవానికి 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. యూని వర్శిటీ సిడిఇ ఆడిటోరియంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆయన పోలీసు అధికారుల తో సమావేశమయారు. సాయంత్రం ఉత్సవాల ప్రారంభ వేదిక అయిన ‘ఎ’ గ్రౌండ్‌ను సందర్శిం చారు. ప్రారంభోత్సవం జరిగే హాలును, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆహ్వాన పత్రిక ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని వారు ఇ-పాస్‌తో పాటు ఇన్విటేషన్ కార్డు కూడా తీసుకు రావాలని తెలియజేశారు. బందోబస్తులో ఐదుగురు డిసిపి లు, ఇద్దరు జాయింట్ సిపిలు, ముగ్గురు అదనపు సిపిలు ఇతర పోలీసు అధికారులు ఉంటారని తెలి పారు. హాలు లోపల 170 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పోలీస్ అధికారిణి స్వాతిలక్రా, డిసిపి సత్యనారాయణ, పలువురు డిసిపి, ఎసిపిలు, కాచిగూడ ఎసిపి లక్ష్మినారాయణ, ఒయు ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పలువురు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఒయు రిజి స్ట్రార్ ప్రొ॥ సిహెచ్. గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి ప్రొ॥ ఆర్.లింబాద్రి, యుజిసి డీన్ ప్రొ॥ పార్థసారథి, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొ॥ పి.లక్ష్మినారాయణ,  ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ॥ ఎల్‌కె రాథోడ్, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డా॥ పి.విష్ణుదేవ్, పిఆర్‌ఒ డా॥ ఇ.సుజాత తదితరులు ఉన్నారు. 26వ తేదీన ఒయు చుట్టుపక్క ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  ఉం టాయి. విఐపిలు, వివిఐపిలు, నాయకులు, విద్యార్థుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ఆ రోజు  మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఉస్మాని యా యూనివర్శిటీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.అలాగే మధ్యా హ్నం 1.15 గంటల నుంచి 1.40 గంటల వరకు ఒయు నుంచి రాజ్‌భవన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  సాయంత్రం 5.15 గంటల నుంచి 6 గంటల వరకు గచ్చిబౌలి నుంచి బేగంపేట్ విమానాశ్రయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్ కళాశాల నుంచి తార్నాక వెళ్లే వాహ నాలను సితాఫల్‌మండి టి జంక్షన్ వద్ద సితాఫల్‌మండి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తా రు. హబ్సిగూడ, తార్నాక, ఎన్‌సిసి గేటు, డిడికాలనీ, విద్యానగ ర్, రామ్‌న గర్, విద్యానగర్ రహదారులపై కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించా రు. ఇక ఆర్‌టిసి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

Comments

comments

Related Stories: