బైక్ ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

గణపురం: గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైక్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గణపురం ఎస్ఐ కె.ప్రవీణ్‌ కుమార్ కథనం ప్రకారం….  భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై బైక్ ను బొగ్గులారీ ఢీకొట్టడంతో గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య(55)అనే రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య మైలారం గ్రామంలోని పెట్రోల్ బంక్ నుంచి  డిజిల్ తీసుకుని తిరిగి […]

గణపురం: గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైక్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గణపురం ఎస్ఐ కె.ప్రవీణ్‌ కుమార్ కథనం ప్రకారం….  భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై బైక్ ను బొగ్గులారీ ఢీకొట్టడంతో గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య(55)అనే రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య మైలారం గ్రామంలోని పెట్రోల్ బంక్ నుంచి  డిజిల్ తీసుకుని తిరిగి వస్తుండగా ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గాంధీనగర్ ప్రధాన కూడలి వద్దకు రాగానే ఉప్పల్ నుండి కెటిపిపికి బొగ్గును తరలిస్తున్న టిఎస్ యుఎ 9549 నంబరు గల లారీ బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో  లింగయ్య ఘటనా స్థలంలోనే చనిపోయాడు.  ప్రమాదం జరుగగానే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారైనట్లు తెలిపారు. మృతుని కుమారుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించామని, అదేవిధంగా ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూమారెల్తు ఉన్నారు.

Comments

comments

Related Stories: