కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై విహెచ్ మండిపాటు

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపడ్డారు. ప్రజలకు సుపరిపాలన అందిచడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలంగాణను కెసిఆర్ తాగుబోతు తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు, చిన్న పిల్లలు చనిపోతున్నా, ప్రభుత్వ నేతలు ప్లీనరీల పేరిట పండుగ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బిసిలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని వెంకయ్యనాయుడు అనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి […]

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపడ్డారు. ప్రజలకు సుపరిపాలన అందిచడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలంగాణను కెసిఆర్ తాగుబోతు తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు, చిన్న పిల్లలు చనిపోతున్నా, ప్రభుత్వ నేతలు ప్లీనరీల పేరిట పండుగ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బిసిలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని వెంకయ్యనాయుడు అనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను విహెచ్ వ్యక్తం చేశారు.