పవన్ కల్యాణ్ అసలు రంగు బయటపెట్టిన మంత్రి..!

విశాఖపట్నం: అనుకున్నట్లే జరుగుతోంది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్నారంటే అతను ముఖ్యమంత్రి కావాలనో, మరోకటో కాదు. కేవలం తెలుగుదేశం పార్టీని తిరిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే లోపాయికారి ఒప్పందం జరుగుతోందని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. అధికార పార్టీని ముచ్చమటలు పట్టిస్తున్న వైఎస్ జగన్ సారధ్యంలోని వైసిపి ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. ఎపి ప్రజల్లో అధికార టిడిపి ఎన్నికల హామీలను పూర్తిగా […]

విశాఖపట్నం: అనుకున్నట్లే జరుగుతోంది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్నారంటే అతను ముఖ్యమంత్రి కావాలనో, మరోకటో కాదు. కేవలం తెలుగుదేశం పార్టీని తిరిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే లోపాయికారి ఒప్పందం జరుగుతోందని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. అధికార పార్టీని ముచ్చమటలు పట్టిస్తున్న వైఎస్ జగన్ సారధ్యంలోని వైసిపి ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. ఎపి ప్రజల్లో అధికార టిడిపి ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడంతో వ్యతిరేకత వచ్చింది. అలాగే శాసన సభ్యులు, మంత్రుల పనితీరు బాగాలేకపోవడంతో జనం దుమ్మెత్తిపోస్తున్నారనేది నిత్యసత్యం. దీన్ని అవకాశంగా మలచుకునే ప్రయత్నంలో వైసిపి ముందంజలో ఉంది. ఇప్పటికే జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయడంలో సఫలమైంది. జనాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో ఉంది. ఏదిఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో రావాలంటే జగన్ పార్టీకి కాపు జనం ఓట్లు మళ్లించకుండా చేయడమే లక్షంగా పవన్ కల్యాణ్ స్వెచ్ అని అంటున్నారు. అందులో భాగంగా ఎపి మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి, బిజెపి,జనసేన కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదనీ, కావాలంటే పుస్తకంలో నోట్ చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడంతో పవన్ జిత్తులమారి వ్యవహారం బయటపడిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, తమ పార్టీ రెండు రాష్ట్రాల్లోను పోటీ చేస్తుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీ ఎన్‌డిఎ భాగస్వామ్యంలో లేదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తానని ప్రకటించారు.
ఏదిఏమైనప్పటికీ పవన్ పార్టీ ఇటు కాపు సామాజిక వర్గం, చిరు, పవన్ అభిమానుల ఓట్లను చీల్చి జగన్‌ను చెక్‌పెట్టే పనిలో భాగంగా లోపాయికారి ప్రయత్నాలు సాగుతున్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పవన్ తన స్వప్రయోజనాల కోసమే టిడిపికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే పవన్ కల్యాణ్ టిడిపి నాయకులపై గానీ, ప్రభుత్వంపైగానీ సరైన రీతిలో విమర్శలు చేయడంలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.