8.65 వడ్డీ రేటుకు ఆర్థిక శాఖ ఓకే

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇపిఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి)పై 8.65 శాతం వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణ యంతో దాదాపు నాలుగు కోట్ల మంది ఇపిఎఫ్‌ఒ సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. కార్మిక మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్థిక శాఖ ఈ నిర్ణ యాన్ని ప్రకటించింది. ఇపిఎఫ్‌ఒ(ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ట్రస్టీల ఈ 8.65 శాతం వడ్డీ రేటు నిర్ణయం తీసు కోగా.. దీనికి […]

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇపిఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి)పై 8.65 శాతం వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణ యంతో దాదాపు నాలుగు కోట్ల మంది ఇపిఎఫ్‌ఒ సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. కార్మిక మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్థిక శాఖ ఈ నిర్ణ యాన్ని ప్రకటించింది. ఇపిఎఫ్‌ఒ(ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ట్రస్టీల ఈ 8.65 శాతం వడ్డీ రేటు నిర్ణయం తీసు కోగా.. దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సుముఖత వ్యక్తం చేసి, కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీ రేటు ఏర్పాటు చేసి న తర్వాత నిధుల మిగులు ఉండొచ్చని ఇపిఎఫ్‌ఒ అంచనా వేస్తోంది. ఇపిఎఫ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవల కార్మిక మంత్రిత్వశాఖకు సూచించిందనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కార్మిక శాఖమంత్రి బండారు దత్తా త్రేయ ఈ వార్తలపై గురువారంనాడు వివరణ ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను పిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటును పొందనున్నారని, ఈమేరకు డిసెంబర్ లో ఆర్గనైజేషన్ ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు. సిబిటి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు) 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించాయని, తమ మంత్రి త్వశాఖ ఆర్థిక మంత్రిత్వశాఖతో చర్చలు నిర్వహిస్తూనే ఉందని ఆయన తెలిపారు. 8.65 శాతం వడ్డీ రేటును ఏర్పాటు చేయడం ద్వారా రూ.158 కోట్లు మిగులు ఉండనుందని అన్నారు. అవసరమైతే ఆర్థిక మంత్రి త్వశాఖతో మాట్లాడతామని, 8.65 శాతం వడ్డీ రేటును అంగీకరించాలని కోరతామని అన్నారు. వడ్డీ ఆదాయం కార్మికులకు ఇవ్వాలనుకుంటే.. అది ఎలా, ఎప్పుడు అనేది ప్రశ్నార్థక మేనని అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇపిఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటును ఇవ్వాలని ఇపిఎఫ్‌ఒ అత్యున్నత సంస్థ సిబిటి నిర్ణయించింది.

అదే సమయంలో సిబిడి ఓ సిఫారసు చేసింది. ఈమేరకు 20 ఏళ్లుగా ఇపిఎఫ్ జమ చేస్తున్నవారికి పదవీవిరమణ సమయంలో విధేయ త, జీవిత ప్రయోజనం కింద రూ.50వేల వరకు నగదు పొందనున్నారు. ఇడిఎల్‌ఐ(ఉద్యోగుల డిపాజి ట్ అను సంధాన బీమా) పథకాన్ని సవరించాలని సిబిటి సిఫారసు చేసింది. దీని ప్రకారం, 20 ఏళ్లుగా ఇపిఎఫ్ జమ చేస్తు న్నవారు ప్రయోజనం పొందనున్నారు. మూల వేతనం (బేసిక్ సాలరీ) రూ. 5వేల వరకు ఉన్నవారికి రూ.30 వే లు అందిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రూ.5 వేలు-రూ.10వేల మధ్య మూల వేతనం గలవారికిరూ. 40వేలు, రూ. 10వేల కంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 50వేలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా రెండేళ్లపాటు ఈ నగదును అందిస్తామ ని, ఆ తర్వాత దీనిపై సమీక్ష జరిపి మళ్లీ నిర్ణయం తీసు కుంటామని అధికారి వెల్లడించారు. దీంతో పాటు ఇపిఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2.5లక్షల కనీస బీమా అందించనున్నట్లు ఇపిఎఫ్‌ఒ బోర్డు వెల్లడించింది. కాగా శాశ్వత అంగవైకల్యం గల ఉద్యోగులు 20ఏళ్ల కన్నా తక్కువ సంవత్సరాలు జమ చేసినా కూడా ఈ ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

comments

Related Stories: