మల్లన్న సాగర్ టెండర్లకు కెసిఆర్ ఓకే

కసరత్తు ప్రారంభించిన నీటిపారుదల శాఖ హైదరాబాద్: మల్లన్నసాగర్ టెండర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్, గంధమళ్ల, బస్వాపూర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ల టెండర్లు పిలవడానికి ఇరిగేషన్ శాఖ కసరత్తు ప్రారంభిం చింది. వారం, పది రోజుల్లోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. రూ.10,876 కోట్లతో చేపట్టే ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను ఎన్ని ప్యాకేజీలు చేయాలో ఇంకా తేల్చలేదని తెలిసింది. రూ.7249.52 కోట్లు కేవలం మల్లన్నసాగర్ వ్యయమే. రంగనాయకసాగర్ రూ.496.50 కోట్లు, కొండపోచమ్మ […]

కసరత్తు ప్రారంభించిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్: మల్లన్నసాగర్ టెండర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్, గంధమళ్ల, బస్వాపూర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ల టెండర్లు పిలవడానికి ఇరిగేషన్ శాఖ కసరత్తు ప్రారంభిం చింది. వారం, పది రోజుల్లోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. రూ.10,876 కోట్లతో చేపట్టే ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను ఎన్ని ప్యాకేజీలు చేయాలో ఇంకా తేల్చలేదని తెలిసింది. రూ.7249.52 కోట్లు కేవలం మల్లన్నసాగర్ వ్యయమే. రంగనాయకసాగర్ రూ.496.50 కోట్లు, కొండపోచమ్మ రూ.519.70 కోట్లు, గంధమళ్ల రూ.860.25 కోట్లు, బస్వాపూర్ రూ.1,751 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతించింది.

Comments

comments

Related Stories: