తెలుగు గడ్డపై తెలంగాణను పొగుడుతావా..?

కర్నూలు : తెలంగాణలో పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తుంటే.. మన రాష్ట్రంలో (ఎపిలో) ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని అన్న ఓ దళితుడిపై జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ మండిపడిన ఘటన కర్నూలులో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో జరిగింది. ఈ ఉత్సవాల్లో దళిత నేత మద్దయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఇళ్లూ నిర్మించలేదని అంటుండగా.. కలెక్టర్ జోక్యం చేసుకొని విరుచుకుపడ్డారు. […]

కర్నూలు : తెలంగాణలో పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తుంటే.. మన రాష్ట్రంలో (ఎపిలో) ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని అన్న ఓ దళితుడిపై జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ మండిపడిన ఘటన కర్నూలులో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో జరిగింది. ఈ ఉత్సవాల్లో దళిత నేత మద్దయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఇళ్లూ నిర్మించలేదని అంటుండగా.. కలెక్టర్ జోక్యం చేసుకొని విరుచుకుపడ్డారు.
వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దని అన్నారు. “మనకు అన్యాయం చేసిన తెలంగాణను పొగుడుతావా? తెలుగు గడ్డ మీద తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తావా? ఆంధ్రా, రాయలసీమ రక్తం నాలో ఉంది. ఈ వేదికపై ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాల్సి అవసరం లేదు” అని అన్నారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత నేతలు మద్దయ్యకు మద్దతు తెలిపారు. కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఆయన పచ్చ చొక్కా వేసుకున్న నాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

Comments

comments

Related Stories: