అఖిల్ ప్రేయసికి పెళ్లి..?

సిసింద్రి సినిమాతో బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ ఆ తరువాత అఖిల్ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాని అఖిల్ నటనకు, డ్యాన్సులకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే అఖిల్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది మాత్రం ఆయన పెళ్లి విషయంతోనే. జివికె మనవరాలు శ్రీయభూపాల్‌తో అఖిల్ ప్రేమలో పడడం, పెళ్లికి రెడీ అవ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఎంతో ఘనంగా నిశ్ఛితార్థం కూడా జరిగింది. అంతలోనే వీరిద్దరి మధ్య […]

సిసింద్రి సినిమాతో బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ ఆ తరువాత అఖిల్ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాని అఖిల్ నటనకు, డ్యాన్సులకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే అఖిల్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది మాత్రం ఆయన పెళ్లి విషయంతోనే. జివికె మనవరాలు శ్రీయభూపాల్‌తో అఖిల్ ప్రేమలో పడడం, పెళ్లికి రెడీ అవ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి.

ఎంతో ఘనంగా నిశ్ఛితార్థం కూడా జరిగింది. అంతలోనే వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా పెళ్లి ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దీనిపై ఇరు కుటుంబాలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. శ్రేయ ఓ ఎన్నారైను పెళ్లి చేసుకోనుందట. అఖిల్‌తో మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో ఆమె కుటుంబీకులు ఎన్నారై సంబంధం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఎన్నారైను పెళ్లి చేసుకోవడానికి శ్రేయ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు. ప్రస్తుతం అఖిల్ మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమా చేస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. మొదటి చిత్రంతో సక్సెస్‌కు దూరమైన అఖిల్ ఈ చిత్రంతో దాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

Comments

comments

Related Stories: