అంగన్‌వాడీ, ఆశ వలంటీర్లకు పిఎఫ్!

భవిష్యనిధి ట్రస్టీల బోర్డు నిర్ణయం న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాలలో, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దాదాపు 61లక్షల మందికి సామాజిక భద్రతా ప్రయోజనాలను కలుగజేయాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) కేంద్ర ట్రస్టీల బోర్డు గురువారం నిర్ణయించింది.  అంగన్‌వాడి, ఆశ, మధ్యాహ్న భోజన పథకం వంటి పథ కాలలో వలంటీర్లుగా ఉన్నవారికి కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలను కలుగజేయడానికి వీలు గా వారిని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీచేసే అంశాన్ని పరిశీలించాలని […]

  • భవిష్యనిధి ట్రస్టీల బోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాలలో, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దాదాపు 61లక్షల మందికి సామాజిక భద్రతా ప్రయోజనాలను కలుగజేయాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) కేంద్ర ట్రస్టీల బోర్డు గురువారం నిర్ణయించింది.  అంగన్‌వాడి, ఆశ, మధ్యాహ్న భోజన పథకం వంటి పథ కాలలో వలంటీర్లుగా ఉన్నవారికి కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలను కలుగజేయడానికి వీలు గా వారిని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీచేసే అంశాన్ని పరిశీలించాలని బోర్డు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఇపిఎఫ్‌ఒ ప్రకటనలో తెలిపారు. ‘ట్రస్టీల బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం మైలురాయి వంటిది. శ్రామికులందరికీ సామాజిక భద్రత కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.  ట్రస్టీల బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ దిశలో ముంద డుగు’  అని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి, ట్రస్టీల బోర్డు సభ్యుడు డి.ఎస్.సచ్‌దేవ్ తెలిపారు.   ప్రభుత్వ పథకాలలో పనిచేసే కార్మికుల నుంచి తక్కువ భవిష్యనిధి సభ్యత్వం 10 శాతం అని నిర్ణయించా లని  ఇపిఎఫ్‌ఒ కార్మిక మంత్రిత్వ శాఖకు ప్రతిపా దించింది. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులు తమ ఆదాయంలో 12 శాతం సభ్యత్వంగా చెల్లిస్తున్నా రు. పథకాల కార్మికులకు యాజమాన్యం చెల్లించ వలసిన సభ్యత్వాన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.   ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో 14 లక్షల మంది అంగన్‌వాడి కార్మికులు, 12 లక్షలమంది అంగన్‌వాడి సహాయకులు, 25.50లక్షల మంది మధ్యాహ్న భోజనం తయారీ కార్మికులు, 10లక్షల మంది ఆశా కార్మికులు  ఉన్నారు.  ప్రస్తుతం స్కీంల లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా అమలుచేసే సామాజిక భద్రత ప్రయోజనం ఏదీ లభించడం లేదు. కనీసం ఇరవై మంది కార్మికులున్న ఎలాంటి సంస్థకైనా భవిష్యనిధి పథకం వర్తించే విధంగా కేం ద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయవచ్చు.  పిఎఫ్ చెల్లింపుల నుంచి మినహాయింపు పొందగోరే సంస్థ ల మూల నిధి రూ. 100 కోట్లు ఉండటమే కాక కనీ సం 500 మంది ఉద్యోగులను కలిగి ఉండాలి.  నిబంధనల ప్రకారం అర్హత సంస్థలకు ఐదేళ్ల పాటు పిఎఫ్ చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తారు.

Comments

comments

Related Stories: