మెగాస్టార్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు?

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరు తన నెక్స్ మూవీ కోసం ఎంపికచేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ ప్రకారం ఇందులో హీరోకు ముగ్గురు భార్యలుంటారట. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి అసలు కథ ప్రకారం ముగ్గురు భార్యలను ఉంచుతాడా… లేదంటే మెగాస్టార్‌తో స్క్రీన్‌పైన ఏకపత్నీ వ్రతం చేయిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలుండేవారని చెబుతుండేవారు. ఆ […]

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరు తన నెక్స్ మూవీ కోసం ఎంపికచేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ ప్రకారం ఇందులో హీరోకు ముగ్గురు భార్యలుంటారట. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి అసలు కథ ప్రకారం ముగ్గురు భార్యలను ఉంచుతాడా… లేదంటే మెగాస్టార్‌తో స్క్రీన్‌పైన ఏకపత్నీ వ్రతం చేయిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలుండేవారని చెబుతుండేవారు. ఆ ప్రకారమే సినిమాలోనూ చిరంజీవికి ముగ్గురు భార్యలను ఉంచుతారో లేదో చూడాలి. అసలే కథానాయికలకు కరువు రావడంతో ఏకంగా మెగాస్టార్‌కు జోడీగా ముగ్గురిని వెతకాలంటే కష్టమే. అందుకే కథలో స్వల్ప మార్పులు చేసి ఇద్దరు లేదా ఒకే హీరోయిన్‌తో సరిపెడతారనే టాక్ వినిపిస్తోంది. ముగ్గురు కథానాయికలంటే బడ్జెట్ కూడా పెరిగే ప్రమాదముంది. మరీ సినిమా సీరియస్‌గా ఉండకుండా రొమాన్స్ కూడా బాగా పండించేందుకు ముగ్గురు నాయికలను కూడా తీసుకునే అవకాశం ఉంది. చివరికి చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి ఏది ఫైనల్ చేస్తారో చూడాల్సిందే.

Comments

comments

Related Stories: