పూరీ-బాలయ్య మూవీ టైటిల్ ఇదే..!?

నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబీనేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ పవర్‌ఫుల్ చిత్రానికి ఏ టైటిల్ పెట్టనున్నారని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘లోఫర్’, ‘రోగ్’ ఇలాంటి టైటిల్‌లకు పూరీ పెట్టింది పేరు. కాగా గౌతమీపుత్ర శాతకర్ణీ వంటి హిట్ తర్వాత ఇది బాలకృష్ణ చేస్తున్న 101వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పూరీ తనదైన మార్క్‌తో ఈ […]

నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబీనేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ పవర్‌ఫుల్ చిత్రానికి ఏ టైటిల్ పెట్టనున్నారని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘లోఫర్’, ‘రోగ్’ ఇలాంటి టైటిల్‌లకు పూరీ పెట్టింది పేరు. కాగా గౌతమీపుత్ర శాతకర్ణీ వంటి హిట్ తర్వాత ఇది బాలకృష్ణ చేస్తున్న 101వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పూరీ తనదైన మార్క్‌తో ఈ చిత్రానికి కూడా మంచి క్యాచీ టైటిల్‌ని పెట్టారని వార్త ప్రస్తుతం టి-టౌన్‌లో హల్‌చల్ చేస్తుంది.
బాలకృష్ణ-పూరీల మూవీ టైటిల్‌కి ‘టపోరీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారనే వార్త ప్రస్తుతం సినిమాపై మరిన్నీ అంచనాలను పెంచుతోంది. ఈ టైటిల్ పూరీ పాత టైటిల్స్‌లా క్యాచీగానే ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం టైటిల్‌ని ఓకే చేయడంపై కాస్త వెనుకంజ వేస్తున్నారట.. మరి ఈ టైటిల్‌ని బాలయ్య ఓకే చేస్తారో లేదో.. వేచి చూడాల్సిందే..

Comments

comments

Related Stories: