పేదల ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు

బేసిక్ సేవింగ్ బ్యాంకు ఖాతాలు, ప్రధాని జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తించబోవని ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతిభట్టాచార్య వివరణ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధనలను ఎస్‌బిఐ అమల్లోకి తీసుకరానున్న విషయం తెలిసిందే. పైన సూచించిన వాటికి ఎటువంటి నిబంధనలు వర్తించవని ఆమె తేల్చి చెప్పారు. ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవని ఆమె వెల్లడించారు. అయితే మిగతా బ్యాంకులు చాలా వరకు […]

బేసిక్ సేవింగ్ బ్యాంకు ఖాతాలు, ప్రధాని జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తించబోవని ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతిభట్టాచార్య వివరణ ఇచ్చారు.

వచ్చే ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధనలను ఎస్‌బిఐ అమల్లోకి తీసుకరానున్న విషయం తెలిసిందే. పైన సూచించిన వాటికి ఎటువంటి నిబంధనలు వర్తించవని ఆమె తేల్చి చెప్పారు. ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవని ఆమె వెల్లడించారు.

అయితే మిగతా బ్యాంకులు చాలా వరకు ఈ ఛార్జీలను అమలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. నూతన నిబంధనలు సరిగ్గా చదవని వారే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్‌బిఐ 2012లో అప్పటి వరకు ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను ఎత్తివేసింది. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న నిబంధనలపై వెనక్కి తగ్గేలా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

Related Stories: