ఫొటోగ్రఫీతో ప్రేమలో పడిపోయా

సౌత్‌లో గ్లామరస్ తారగా రాణించి బాలీవుడ్‌కు వెళ్లిన భామ ఇలియానా. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల  ఓ విదేశీ యువకుడి ప్రేమలో పడి  ప్రేమాయణాన్ని కొనసాగిస్తోంది ఈ భామ. ‘రుస్తుం’ మూవీ తర్వాత బాలీవుడ్‌లో ఆమె సినిమాలేమీ రిలీజ్ కాలేదు. ఇలియానా ఏ సినిమాలోనూ నటించడం లేదు. మరి ఖాళీగా ఉంటున్న ఈ భామ ఏం చేస్తోంది అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. “ఖాళీ సమయాల్లో ఫొటోగ్రఫీ […]

సౌత్‌లో గ్లామరస్ తారగా రాణించి బాలీవుడ్‌కు వెళ్లిన భామ ఇలియానా. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల  ఓ విదేశీ యువకుడి ప్రేమలో పడి  ప్రేమాయణాన్ని కొనసాగిస్తోంది ఈ భామ. ‘రుస్తుం’ మూవీ తర్వాత బాలీవుడ్‌లో ఆమె సినిమాలేమీ రిలీజ్ కాలేదు.

ఇలియానా ఏ సినిమాలోనూ నటించడం లేదు. మరి ఖాళీగా ఉంటున్న ఈ భామ ఏం చేస్తోంది అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. “ఖాళీ సమయాల్లో ఫొటోగ్రఫీ ఎంతో బావుంటుంది. నేను ఇటీవల కాలంలో పూర్తిగా ఫొటోగ్రఫీకి అంకితమై పోయాను. ముఖ్యంగా ఫొటోగ్రఫీతో ప్రేమలో పడిపోయా. పిల్లలు మనందరికీ రోల్ మోడల్స్. అందుకే పిల్లలకు సంబంధించిన ఫొటోల్ని మాత్రమే చాలా ఎక్కువగా తీస్తున్నాను”అని చెప్పింది ఇలియానా.

Comments

comments

Related Stories: