ఇఎసెట్‌గా మారనున్న ఎంసెట్

పరీక్షకు తగ్గనున్న ప్రాధాన్యత హైదరాబాద్ : నీట్ ద్వారా ఆయుష్ కోర్సులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఎంసెట్(ఇఎఎంసిఇటి)లో నుంచి ఎం(మెడిసి న్) పోయి ఇఎసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ సెట్)గా మారనుంది. నీట్ ర్యాంకుల ఆధారం గా ఆయుష్ సీట్ల భర్తీ చేపట్టాలని కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మార్గదర్శకాలు అందాయి. శనివారం ఆ శాఖ అధికారికంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలుపనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ బిఎస్సీ, వెటర్నరీ కోర్సుల భర్తీకే ఇఎసెట్ నిర్వహించ […]

పరీక్షకు తగ్గనున్న ప్రాధాన్యత

హైదరాబాద్ : నీట్ ద్వారా ఆయుష్ కోర్సులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఎంసెట్(ఇఎఎంసిఇటి)లో నుంచి ఎం(మెడిసి న్) పోయి ఇఎసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ సెట్)గా మారనుంది. నీట్ ర్యాంకుల ఆధారం గా ఆయుష్ సీట్ల భర్తీ చేపట్టాలని కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మార్గదర్శకాలు అందాయి. శనివారం ఆ శాఖ అధికారికంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలుపనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ బిఎస్సీ, వెటర్నరీ కోర్సుల భర్తీకే ఇఎసెట్ నిర్వహించ వలసి ఉంటుంది. వైద్యవిద్యలో చేరాలనుకునే విద్యార్థులు ఎంబిబిఎస్, బిడిఎస్ తర్వాత ఆయు ష్ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తారు.

అన్ని కోర్సుల కు ఒకే పరీక్ష ఉండడం ద్వారా విద్యార్థులకు కొంత ఉపశమనం కలుగుతుంది. రెండు పరీక్ష లకు సిద్దమయ్యే అవసరం లేకపోవడంతో ఒక నీట్‌కే సీరియస్‌గా సిద్దమయ్యే అవకాశం ఉం టుంది. ఎంసెట్‌లో నుంచి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులతో పాటు బిఎఎంఎస్, బిహెచ్‌ఎంఎస్, బియుఎంఎస్, యోగా వంటి ఆయుష్ కోర్సులు తొలగిపోవడంతో ఈ పరీక్షకు ప్రాధాన్యత తగ్గనుంది. ప్రతి ఏటా ఎంసెట్ పరీక్షకు హాజర య్యే విద్యార్థుల కంటే ఇంజనీరింగ్ సీట్లే అధి కంగా ఉంటూ ఇంజనీరింగ్‌లో సీట్లు మిగిలిపో తున్నాయి. బి.ఎస్సీ(అగ్రికల్చరల్), వెటర్నరీ కోర్సులకు మాత్రం కొంచెం డిమాండ్ ఉంది. వైద్య విద్యకు సంబంధించిన అన్ని రకాల సీట్లు నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ కానున్న నేపథ్యంలో ఎంసెట్‌కు ప్రాధాన్యత తగ్గనుంది.

Comments

comments

Related Stories: