నేడు ఉద్యోగ మేళా

నిజామాబాద్ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గురువారం రోజున ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు గామా హెల్త్‌కేర్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.కౌశల్య ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు సుభాష్‌నగర్ గామా ఫిట్ హెల్త్‌కేర్‌లో ఉద్యోగ మేళా ప్రారంభమవుతుందని అసిస్టేంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన 30 సం॥ల నుండి 45 సం॥లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ప్రాజెక్టు రిక్రూట్‌మెంట్ ఆఫిసర్స్, కనీస అర్హత ఇంటర్ వయస్సు 20 నుంచి […]

నిజామాబాద్ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గురువారం రోజున ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు గామా హెల్త్‌కేర్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.కౌశల్య ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు సుభాష్‌నగర్ గామా ఫిట్ హెల్త్‌కేర్‌లో ఉద్యోగ మేళా ప్రారంభమవుతుందని అసిస్టేంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన 30 సం॥ల నుండి 45 సం॥లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ప్రాజెక్టు రిక్రూట్‌మెంట్ ఆఫిసర్స్, కనీస అర్హత ఇంటర్ వయస్సు 20 నుంచి 45 సం॥ వరకు ప్రతి నియోజక వర్గం నుండి ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆమె చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో తమ వెంట నిజదృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు 9959099067కు సంప్రదించాలన్నారు.

Related Stories: