ప్రేమ్‌చంద్ ముందు, తర్వాత

ప్రేమ్ చంద్ యుగంలో కథానిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. సమాజం జీవితం వ్యక్తులు, వ్యవస్థ స్వరూప స్వభావాలు, బలవంతుడు బలవంతుని దోచుకోవడం జమీందారుల విచ్చలవిడితనం, రైతుల దీన పరిస్థితులుగల ప్రజల్లోని చేతగాని తనం, సోమరితనం, బానిసత్వం మొదలుగా మనిషితత్వాన్ని సమాజంలోని వ్యక్తుల దివాళ కోరుతనాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించబడింది. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కథకు చాలా ప్రాధాన్యం ఉంది. బేతాళ కథలు కాశీమజిలీ కథలు, హితోపదేశం పంచతంత్ర కథలు ప్రచారంలో ఉండేవి. ఆ సంప్రదాయంతోనే అన్ని భారతీయ […]

ప్రేమ్ చంద్ యుగంలో కథానిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. సమాజం జీవితం వ్యక్తులు, వ్యవస్థ స్వరూప స్వభావాలు, బలవంతుడు బలవంతుని దోచుకోవడం జమీందారుల విచ్చలవిడితనం, రైతుల దీన పరిస్థితులుగల ప్రజల్లోని చేతగాని తనం, సోమరితనం, బానిసత్వం మొదలుగా మనిషితత్వాన్ని సమాజంలోని వ్యక్తుల దివాళ కోరుతనాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించబడింది.

భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కథకు చాలా ప్రాధాన్యం ఉంది. బేతాళ కథలు కాశీమజిలీ కథలు, హితోపదేశం పంచతంత్ర కథలు ప్రచారంలో ఉండేవి. ఆ సంప్రదాయంతోనే అన్ని భారతీయ కథలు రచించబడ్డాయి. అదే దిశల్లో హిందీ కథానిక రూపుదిద్దుకుంది. అయితే ఆధునిక హిందీ కథానిక ఖడేబోలీ గద్య రచన తరువాత వికాసం చెందింది. సుమారు 120 సంవత్సరాల పూర్వం నుండి హిందీ కథానిక వెలువడింది. క్రీ.శ 1900లో ‘సరస్వతి’ ‘ఇందు’ పత్రికల్లో కథానికలు ప్రచు రించబడ్డాయి. 1900 లో కిశోరీలాల్ గోస్వామి కథానిక “ఇందుమతి” ప్రచురించబడింది. 1901లో మాధవ్ సప్రేరచన “ఎక్‌టో కరీఛర్ మిట్టే” వెలువడింది.

1903లో రామచంద్ర శుక్ల రచన గ్యారహ వర్షకా సమయ్‌” వెలువడింది. బంగ మహిళ రచన (1907)‘దువాయీ వాలీ’ వెలువడింది. 1903 లో గిరిజాదత్ వాజ్‌పేయ్ రచన ‘పండిత్ ఔర్ పండితాని’ వెలువడింది. ఆకాలంలోనే రాధికారమణ్ “కానోం మే కంగనా” కౌశిక్‌” “రక్షాబంధన్ బృందావన్ లాల్ వర్మ” రాజీబంధ్‌భాయీ మైథిలీ శరణ్ గుప్త “నకిలీ కిలా’ చంద్రధర్ శర్మ గులేరీ కథానికలు ‘సుఖ్ మయ్ జీవన్’ ‘ఉస్‌నే కహా థా’ ‘బుధ్ధూ కాకాంటా ’వెలువడ్డాయి. జయశంకర్ ప్రసాద్ ఆకాలంలోనే కవిగా నాటకకర్తగా కథానికా రచయితగా పేరు పొందారు. ఆయన రచించిన గ్రామ్, ఆంధీ ఇంద్రజాల్, పురస్కార్ ఛాయా, ఆకాశ్ దీప్ మొదలగు కథలు వెలువడ్డాయి. ఆ కాలంలోనే ప్రేమ్‌చంద్ కథలు వెలువడ్డాయి. హిందీకథానికను పరిశీలిస్తే ప్రేమ్‌చంద్ యుగం చాలా ప్రధానమైనది . అందుచేత హిందీ కథానిక వికాసాన్ని ఈ రకంగా విభజించవచ్చు.
1.తొలిదశ (ఆరంభకాలం)
2 ప్రేమ్‌చంద్ ముందు
3.ప్రేమ్‌చంద్ యుగం
4.ప్రేమ్‌చంద్ తరువాత
5. అత్యాధునిక కథానిక (నయీకహానీ)

1.తొలి దశలో కథానిక రూపు దిద్దుకున్నది. ఆనాటి జీవితాన్ని ముఖ్యంగా అలవాట్లను, సంప్రదాయాలను, కట్టుబాట్లను వర్ణిస్తూ కొత్తగా వస్తున్న జీవితాన్ని వర్ణించే ప్రయత్నం కథల ద్వారా జరిగింది.
2. ప్రేమ్‌చంద్ ముందు కాలంలో తొలిదశ కంటే హిందీ కథానిక ఎంతో ముందడుగు వేసింది. సమాజం గూర్చి ఆలోచన ఆరంభమయింది. ఆచారవంతుల జీవితం లోని లోటుపాట్లను ఎత్తిచూపడం జరిగింది.ప్రేమకు ఒక కొత్త నిర్వచనం ఆ కథల్లో కనిపిస్తుంది. కిశోరీ లాల్ గోస్వామి రచన ఇందుమతి, విశ్వంభర్‌నాథ్ శర్మకౌశిక్‌” “రక్షాబంధన్‌” విష్ణుప్రభాకర్ ‘మేరావతన్’ వంటికథలు పేర్కొనదగినవి.

3. ప్రేమ్ చంద్ యుగంలో కథానిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. సమాజం జీవితం వ్యక్తులు, వ్యవస్థ స్వరూప స్వభావాలు, బలవంతుడు బలవంతుని దోచుకోవడం జమీందారుల విచ్చలవిడితనం, రైతుల దీన పరిస్థితులు, ప్రజల్లోని చేతగాని తనం, సోమరితనం, బానిసత్వం మొదలుగా మనిషితత్వాన్ని సమాజంలోని వ్యక్తుల దివాళ కోరుతనాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించబడింది.
ఆకాలంలో ప్రేమ్‌చంద్ రచించిన 300 కథలు జయశంకర్ ప్రసాద్ ఛాయా , ఆకాశ్‌దీప్ పురస్కార్ కథలు పేర్కొనదగినవి
సుదర్శన్- అల్‌బమ్,. హరకీజిత్ యాత్రా కథలు
భగవతీ ప్రసాద్‌వాజ్‌పేయ్- మధుపర్క్ మిఠాయివాలా, మేరే సపనే కథలు
విష్ణు ప్రభాకర్ – ఆది అవుర్ అంత్
మేరావతన్ సంఘర్ష కేబాద్, ప్రేమ్ చంద్ కథలు ఫన్, పూస్ కీరాత్, పంచ్ పరమేశ్వర్ సద్గతి శత్‌రంజ్ కేఖిలాడీ, ఈ ద్ గాహ్ ముక్తిధన్ మొదలైన కథానికలు పాఠకులను ప్రభావితం చేశాయి.

4. ప్రేమ్ చంద్ తరువాత : ప్రేమ్ చంద్ తరువాత సమాజంలో చాలా మార్పు వచ్చింది. విద్య, అధ్యయనం అవగాహన లక్షం పట్ల సమాజంలో ఆలోచనలు ఆరంభమయ్యాయి. సమాజ సంస్కరణ, సంప్రదాయాల ఉల్లంఘన కొత్త జీవితాలకు ఆలోచనలకు పునాది పడసాగింది.సమాజంలోని సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసే దృష్టి ప్రజల్లో బలపడసాగింది. స్త్రీల విద్యకు ప్రాధాన్యం పెరిగింది. రాజకీయాల్లో కొత్త దృష్టి వచ్చింది. ఆకాలంలో యశ్‌పాల్ కథలు ‘ఆద్మీకాబచ్బా’
పింజడేకీ ఉడాన్, జ్ఞాన్‌దాన్ అభిశప్త్ పరదా వంటి కథలు అజ్ఞేయ కథలు ‘రోజ్’ సేబేజౌర్ దేవ్, జీవన్‌శక్తి ఉషాప్రియంవద రచనలు -జిందగీ గులాబ్‌కేపూల్ ఏక్ కొయీ దూసరా భీష్మ్ సహాని కథలు – అమృతసర్ ఆగయా హై, ఛట్‌కతీరాఖ్
ఛీప్ కీ దావత్,

ఫణీశ్వర్ నాథ్ రేణు కథలు : ఠేస్ తీస్‌రీకసమ్ రసప్రియా, ఆదిమ్ రాత్రి కేనాహ్‌క్ ధర్మవీర్ భారతీ రచనగులే కీబన్నో మార్కండేయ్- దానా – ఛూసా చీచ్ కేలోగ్ మన్నూ భండారీ రచనలు తీసరా ఆద్మీబంద్ దరవాజ్‌కేసాథ్, అకేలీ మోహన్ రాకేశ్ రచనలు జంగలా మందీ పరమాత్మాకాకుత్తా, అపరిచిత్ బాగా ప్రజా దరణ పొందాయి. వాటిల్లో జనజీవితం దర్శనమిస్తుంది.

అత్యాధునిక కథానిక : (నయీకహాని) నయీకహానీ సమాజంలో సంకీర్ణంగా వ్యాపించిన లేదా అల్లుకున్న ఆలోచనలకు వ్యతిరేకంగా వచ్చింది. సంప్రదాయం సమాజ కట్టుబాట్లకు ఈ రచయితలు చెల్లుచీటీ ఇచ్చారు. వీరు సరికొత్త ఆలోచనలకు పునాది వేశారు. ధర్మవీర్ భారతి, లక్ష్మీనారాయణ్ లాల్, నిర్మల్ వర్మ అమర్‌కాంత్ భీష్మసహానీ, శ్రీకాంత హరి శంకర్ పరసాయీ, రవీంద్ర కాలియా రాజేంద్ర అవస్థీ మొదలైన వారు తమరచనలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. సమాజంలో పేరుకున్న అవినీతి ఆడంబరం అవినీతికి మూల కారణమైన దుర్గంధభూయిష్ట మయిన రాజకీయ స్థితిని నిస్సంకోచంగా ఎత్తి చూపించారు. ఇందుమతి కథతో ఆరంభమయిన హిందీకథానిక సమా జానికి సర్వదా అద్దం పడుతూ సమా జాన్ని ప్రభావితం చేస్తూ ముందుకు సాగిపోతుంది.

-డా.వై.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, 9791025727