సుక్కు, చెర్రీ మూవీ కథ ఇదేనట..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎల్లప్పుడు తనదైన శైలిలో కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాడు. ఇదే కొవలోనే వచ్చినవి వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు. అలాగే తొలి చిత్రం ఆర్య కూడా కాసాంత వెరైటీ స్టోరీ అనే చెప్పాలి. ప్రస్తుతం సుక్కు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఓ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం పూజకార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఈ మూవీ విషయంలో ఓ పుకారు ప్రస్తుతం అంతర్జాలంలో […]

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎల్లప్పుడు తనదైన శైలిలో కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాడు. ఇదే కొవలోనే వచ్చినవి వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు. అలాగే తొలి చిత్రం ఆర్య కూడా కాసాంత వెరైటీ స్టోరీ అనే చెప్పాలి. ప్రస్తుతం సుక్కు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఓ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం పూజకార్యక్రమాలు కూడా జరుపుకుంది.

అయితే ఈ మూవీ విషయంలో ఓ పుకారు ప్రస్తుతం అంతర్జాలంలో తెగ షికారు చేస్తోంది. మూవీ కథ లీకయిందనేది ఈ పుకారు సారాంశం. దీని ప్రకారం సినిమా స్టోరీ ఇలా ఉంది… కథనాయకుడు ప్యూర్ పల్లెటూరి అబ్బాయి. అలాంటి యువకుడు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా నగరానికి వస్తాడు. అక్కడే ఓ ప్రయోగశాలలో పనికి కుదురుతాడు. అయితే అక్కడి శాస్త్రవేత్తలు మనిషిపై ఓ ప్రయోగం చేయాలనే దుర్భుద్దితో ఉంటారట.

ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న హీరోపై వారి కన్నుపడుతుంది. దాంతో శాస్త్రవేత్తలు హీరోపై ప్రయోగం చేశారా? ఒకవేళ చేస్తే తదుపరి పరిణామాలేంటి అనే విషయాలను సుక్కు ఆసక్తికరంగా, వైవిధ్యంగా తెరకెక్కించనున్నాడని పుకారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ కథ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Comments

comments

Related Stories: