సెల్ ఫోన్ కోసం యువకుడి హత్య

మహబూబ్‌నగర్ క్రైం : యువకుడి దారుణ హత్య కేసు ను పోలీసులు 24 గంటల్లోనే ఛేదిం చారు. నిందితుడి నుంచి మూడు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు ఛేదించిన తీరును మహబూబ్‌నగర్ డిఎస్‌పి భాస్కర్ శుక్ర వారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. పక్షిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం,తుందూర్ గ్రామానికి చెందిన ఎడ్లవెళ్లి వెంకటస్వామి (22)అనే యువకుడు పట్టణంలోని శివ శక్తి నగర్ కాలనీ […]

మహబూబ్‌నగర్ క్రైం : యువకుడి దారుణ హత్య కేసు ను పోలీసులు 24 గంటల్లోనే ఛేదిం చారు. నిందితుడి నుంచి మూడు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు ఛేదించిన తీరును మహబూబ్‌నగర్ డిఎస్‌పి భాస్కర్ శుక్ర వారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. పక్షిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం,తుందూర్ గ్రామానికి చెందిన ఎడ్లవెళ్లి వెంకటస్వామి (22)అనే యువకుడు పట్టణంలోని శివ శక్తి నగర్ కాలనీ లో సత్తూర్ రమేష్ ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అతడి దగ్గరున్న రూ,2500లను మరియు స్మాట్ ఫోన్‌ను చూసిన నందిపేట అంజనేయులు (27) అనే యువ కుడు వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. మద్యం సేవించిన అనంతరం వెంకటేష్‌ను బండరాయితో మోది హత్య చేసి అతనివద్ద ఉన్న డబ్బులను తీసుకొని పారిపోయారు. కాగా వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్‌గా గుర్తించినట్లు డిఎస్‌పి వివరించారు. నిందితుడిని పాత పాలమూరులోని అతడి నివాసంలో శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు గడ్డం కాశి, శివకుమార్,హేడ్ కానిస్టేబుల్ అరిఫ్ నవాజ్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ కెశవగౌడ్,రియాజ్ అహ్మద్‌లు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: