స్నేహా ఉల్లాల్ హల్‌చల్

కొన్నేళ్ల క్రితం వరకు స్నేహా ఉల్లాల్ పేరు టాలీవుడ్‌లో బాగానే వినిపించేది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యాక్టింగ్‌లో కూడా అంతే ఉత్సాహాన్ని చూపించింది. కెరీర్‌లో సింహా వంటి భారీ చిత్రాలున్నా… టాలీవుడ్‌లో చాలానే అవ కాశాలు దక్కినా కూడా అమ్మడి కెరీర్ గాడిలో పడలే దు. ఇక్కడ వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడే బాలీ వుడ్‌పై కన్నేయడం… స్నేహా ఉల్లాల్ చేసిన తప్పిదంగా చెబుతారు చాలా మంది. ఆతర్వాత సినిమాల్లో ఈమధ్య కనిపించడం […]

కొన్నేళ్ల క్రితం వరకు స్నేహా ఉల్లాల్ పేరు టాలీవుడ్‌లో బాగానే వినిపించేది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యాక్టింగ్‌లో కూడా అంతే ఉత్సాహాన్ని చూపించింది. కెరీర్‌లో సింహా వంటి భారీ చిత్రాలున్నా… టాలీవుడ్‌లో చాలానే అవ కాశాలు దక్కినా కూడా అమ్మడి కెరీర్ గాడిలో పడలే దు. ఇక్కడ వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడే బాలీ వుడ్‌పై కన్నేయడం… స్నేహా ఉల్లాల్ చేసిన తప్పిదంగా చెబుతారు చాలా మంది. ఆతర్వాత సినిమాల్లో ఈమధ్య కనిపించడం మానేసినా…సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంది. తాజాగా మోడర్న్ డ్రెస్సులో దర్శనమిచ్చి హల్‌చల్ చేసింది. స్ట్రాప్ లెస్… స్లీవ్‌లెస్ స్కర్ట్ వేసుకొని ఈ భామ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “నేను ఇలాంటి డ్రెస్సులు తరచుగా వేస్తుంటా. మినీ స్కర్టులు, డ్రస్సులు నాకు బాగా ఇష్టం”అని చెబుతోంది స్నేహా ఉల్లాల్. తెలుగులో చివరగా యాక్షన్ 3డి చిత్రంలో అల్లరి నరేష్‌కు జోడీగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. హిందీలో కూడా ఆమె సినిమా రిలీజై ఏడాదిన్నర గడిచిపోయింది. ఈమధ్యన పలు బాలీవుడ్ సినిమా వేడుకల్లో దర్శనమిస్తూ మెరుస్తోంది ఈ అందాలతార.

Related Stories: