శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థ కృషి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: గణతంత్ర దినో త్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చందనాదీప్తి మహాత్మగాంధీ చిత్రపటానికి పూల మాల వేసి తివర్ణ జాతీయ పతాకాన్ని ఎగుర వేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వాసులందరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. తాను జిల్లా పోలీసు యంత్రాంగం లో ఒక పాలనాధికారిగా నేనున్నానని ఎప్పుడు శాం తిభద్రతా విషయంలో ప్రజలతో మమేకమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నానని అందుకు తన […]

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: గణతంత్ర దినో త్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చందనాదీప్తి మహాత్మగాంధీ చిత్రపటానికి పూల మాల వేసి తివర్ణ జాతీయ పతాకాన్ని ఎగుర వేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వాసులందరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. తాను జిల్లా పోలీసు యంత్రాంగం లో ఒక పాలనాధికారిగా నేనున్నానని ఎప్పుడు శాం తిభద్రతా విషయంలో ప్రజలతో మమేకమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నానని అందుకు తన కింది స్థాయి పోలీసు అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వర కు పోలీసు సిబ్బంది చాలా బాగా విధులు నిర్వ హిస్తున్నారని, ప్రజలతో సమీపంగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని, ఇకపై కూడా ఇ లాగే కష్టపడి జిల్లా అభివృద్దికి, శాంతిభద్రతల పరి రక్షణకు కృషి చేసి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించడం జరి గింది. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టా రు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాంచంద్రారెడ్డి, మెదక్ టౌన్ సిఐ భాస్కర్, ఎస్‌బిఎస్సై నగేష్, డిసి ఆర్‌బిఎస్సై మల్లయ్య, ఆర్‌ఎస్సైలు అంజద్, గోవ ర్ధన్, డిపిఓ సిబ్బంది, ఎస్పీ పిఆర్‌ఓ జాహంగీర్‌లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: