నిరీక్షణకు ఐదేళ్లు

పోలీస్‌స్టేషన్ నిర్మించారు.. ప్రారంభోత్సవం మరిచారు మండల పరిధిలోని మంగపేటి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం సమీపంలో 2011వ సంవత్సరంలో నూతన పోలీస్‌స్టేషన్ భవనానికి ఆనాటి జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా శంకుస్థాపన చేశారు. ఈ భవనం ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ పథకం ద్వారా రూ.25 లక్షల మంజూరు కాగా కాంట్రాక్టర్ భవన నిర్మాణపు పనులను అనుకున్న సమయానికి పూర్తి చేశారు. భవనం పూర్తి అయిన అనంతరం స్థానిక పోలీస్ అధికారులు భవన ప్రారంభానికి ఉన్నత […]

పోలీస్‌స్టేషన్ నిర్మించారు.. ప్రారంభోత్సవం మరిచారు

మండల పరిధిలోని మంగపేటి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం సమీపంలో 2011వ సంవత్సరంలో నూతన పోలీస్‌స్టేషన్ భవనానికి ఆనాటి జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా శంకుస్థాపన చేశారు. ఈ భవనం ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ పథకం ద్వారా రూ.25 లక్షల మంజూరు కాగా కాంట్రాక్టర్ భవన నిర్మాణపు పనులను అనుకున్న సమయానికి పూర్తి చేశారు. భవనం పూర్తి అయిన అనంతరం స్థానిక పోలీస్ అధికారులు భవన ప్రారంభానికి ఉన్నత స్థాయి అధికా రుల అనుమతితో ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు రెండు పర్యాయ ములు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినప్పటికి ఉన్నతాధికారులు భవన ప్రారంభోత్సవానికి రాక పోవడంతో భవనం ప్రారంభించకుండానే ఉండి పోయింది. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనం, మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు నిర్మించింది కావడం తో శిథిలవస్థకు చేరుకున్నది. పోలీస్‌స్టేషన్ భవనం తోపాటు పోలిస్ శాఖ, సిబ్బంది నివసిస్తున్న క్వార్టర్స్ కూడా శిథిలవస్థకు చేరుకొని వర్షకాలంలో కురుస్తుండటంతో సిబ్బంది విధిలేని పరిస్థి తుల్లో భవనాలలో నివసిస్తున్నారు. నూతన పోలీస్ స్టేషన్ భవనం సమీపంలో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బంది నివాస గృహాలను ఏర్పా టుచేయడానికి అనువైన స్థలాన్ని అధికారులు ఏర్పాటు చేయడం జరి గింది. ఆ భవనాలు నిర్మాణానికి నిధులు
మంజూరుకాకపోవడంతో సిబ్బంది భవనాలు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు సంబంధిత శాఖాధి కారులు చేపట్టలేదు.

నూతన పోలీస్‌స్టేషన్ భవనం నిర్మించినాటి నుండి నేటివరకు 5గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు మారిన ఏ ఒక్క అధికారి కూడా భవనం ప్రారంభించడానికి చర్యలు తీసుకోక పోవడంతో కొత్త పోలిస్‌స్టేషన్ భవన ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నది. నూతన పోలీస్‌స్టేషన్ చుట్టు ప్రహారి గోడ లేక పోవడంవలన పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదని ప్రజలు చర్చించు కుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు చొరవ తీసుకొని కొత్త పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: