మీరు గ్రాడ్యుయేటా…మీ వయసు 25 ఏళ్ల లోపేనా…అయితే మీకిది బంపర్ ఆఫరే..!!

మీ వయసు ఇంకా పాతికేళ్ల లోపేనా… మీ డిగ్రీ అయిపోయిందా.. మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టినట్టే… ఐసిఐసిఐ బ్యాంక్ నిరుద్యోగ యువకులను మంచి అవకాశం ఇస్తున్నది. డిగ్రీ అయిపోయి… పాతికేళ్ల లోపు ఉన్న యువతీ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ డిప్యూటీ మేనేజర్ గా జాబ్ అవకాశాన్ని అందిస్తున్నది. బ్యాంకింగ్ కెరీర్ పై ఇంటరెస్ట్ ఉన్న ప్రతి యువతీ యువకుడు సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం ఇది. ఒక రకంగా […]

మీ వయసు ఇంకా పాతికేళ్ల లోపేనా… మీ డిగ్రీ అయిపోయిందా.. మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టినట్టే… ఐసిఐసిఐ బ్యాంక్ నిరుద్యోగ యువకులను మంచి అవకాశం ఇస్తున్నది.

డిగ్రీ అయిపోయి… పాతికేళ్ల లోపు ఉన్న యువతీ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ డిప్యూటీ మేనేజర్ గా జాబ్ అవకాశాన్ని అందిస్తున్నది. బ్యాంకింగ్ కెరీర్ పై ఇంటరెస్ట్ ఉన్న ప్రతి యువతీ యువకుడు సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం ఇది.

ఒక రకంగా చెప్పాలంటే, నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫరే.

ప్రతి సంవత్సరం ఐసిఐసిఐ బ్యాంక్ తనకు కావల్సిన మానవ వనరుల కోసం ప్రత్యేకమైన రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను నడిపిస్తుంది. బ్యాంకే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా… బ్యాంకు అవసరాలకు తగ్గట్టుగా ట్రెయిన్ అయిన మానవ వనరులు తయారవుతారు.

ట్రైనింగ్ కోసం మణిపాల్ యూనివర్సిటీ తో ఒప్పందం కుదుర్చుంది ఐసిఐసిఐ బ్యాంకు. ప్రొబేషనరీ ఆఫీసర్లతో పాటు సేల్స్ ఆఫీసర్, ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులకు కూడా విద్యార్థులకు రిక్రూట్ చేసుకుంటుంది ఐసిఐసిఐ.

ప్రస్తుతానికి ICICI Manipal Probationary Officers (PO) Programme – Post Graduate Diploma in Banking (PGDB)  కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఐసిఐసిఐ. డిసెంబర్ 31 తో గడువు ముగియనుంది. జనవరిలో ఆప్టిట్యూట్ టెస్ట్ ను నిర్వహించనుంది బ్యాంక్.

సెలక్షన్ ప్రొసీజర్, ట్రైనింగ్ డిటేల్స్, ఫీ డిటేల్స్ కోసం…//www.icicicareers.com వెబ్ సైట్ ను వీక్షించొచ్చు.

Related Stories: