అండర్-18 హాకీ జట్టుకు ఉదిత నేతృత్వం

న్యూఢిల్లీ: బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో డిసెంబర్ 16 నుంచి 22 వరకు జరుగనున్న మహిళల అండర్-18 ఆసియా కప్ టోర్నమెంటుకు భారత్ హాకీ జట్టుకు మిడ్‌ఫీల్డర్ ఉదిత కెప్టెన్‌గా ఉండబోతున్నది. ఆ టోర్నమెంట్‌లో ఉప కెప్టెన్‌గా సలీమా టెటే ఉండనున్నదని హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. జట్టులో 14 ఏళ్ల సలీమా కీలక సభ్యురాలుగా ఉండనుంది. కెప్టెన్ ఉదితాకు తోడుగా మిడ్‌ఫీల్డ్‌లో సంగీతా కుమారి, పూన మ్, మరియాన కుజుర మహిమా చౌదరి, లాల్‌రెసియా మి వం టి […]

న్యూఢిల్లీ: బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో డిసెంబర్ 16 నుంచి 22 వరకు జరుగనున్న మహిళల అండర్-18 ఆసియా కప్ టోర్నమెంటుకు భారత్ హాకీ జట్టుకు మిడ్‌ఫీల్డర్ ఉదిత కెప్టెన్‌గా ఉండబోతున్నది. ఆ టోర్నమెంట్‌లో ఉప కెప్టెన్‌గా సలీమా టెటే ఉండనున్నదని హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. జట్టులో 14 ఏళ్ల సలీమా కీలక సభ్యురాలుగా ఉండనుంది. కెప్టెన్ ఉదితాకు తోడుగా మిడ్‌ఫీల్డ్‌లో సంగీతా కుమారి, పూన మ్, మరియాన కుజుర మహిమా చౌదరి, లాల్‌రెసియా మి వం టి ప్రతిభావంతులు ఉండనున్నారు. ఫార్వర్డ్ లైన్‌లో సంగీతా కుమారి, పూనమ్, లీలావతి, మల్లమడ జయ, రజ్వీందర్ కౌర్, ముమ్ తాజ్ ఖాన్ ఆడనున్నారు.
జట్టులో…గోల్‌కీపర్లు: దివ్యా తెపె, అల్ఫా కెరెకెట్టా
డిఫెండర్లు: సలీమా టెటే(వైస్ కెప్టెన్), రితు, నీలూ దడియా, సుమన్ దేవి తౌడమ్, గగన్‌దీప్ కౌర్. మిడ్‌ఫీల్లర్లు: ఉదిత(కెప్టెన్), మన్‌ప్రీత్ కౌర్, జ్యోతి, మరియాన కుజుర మహిమా చౌదరి, లాల్‌రెసియామి. ఫార్వర్డర్లు: సంగీతా కుమారి, పూనమ్, లీలావతి మల్లామడ జయ, రజ్వీందర్ కౌర్, ముమ్‌తాజ్ ఖాన్.

Related Stories: