దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట నియోజ కవర్గాన్ని నగదు రహిత లావాదేవీలకు ఎంపిక చేయడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో దీన్ని విజయవంతం చేయడానికి తామంతా సైనికుల్లా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన్ వినియోగం పెరిగినందున నగదు రహిత లావాదేవీలకు ఇది ఎంతోగానో […]

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట నియోజ కవర్గాన్ని నగదు రహిత లావాదేవీలకు ఎంపిక చేయడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో దీన్ని విజయవంతం చేయడానికి తామంతా సైనికుల్లా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన్ వినియోగం పెరిగినందున నగదు రహిత లావాదేవీలకు ఇది ఎంతోగానో సౌకర్యంగా వుంటుం దన్నారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో తామంతా ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. పేదలు ఈ విషయంపై ఆందోళన చెందకుండా సద్వినియోగం చేసుకోవాలని వారికి ఏమైనా అనుమానాలు, ఇబ్బందులుంటే తామతో పాటు అధికార యంత్రాంగం వారికి సహాయపడతామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల మూలంగా లంచాలు, దొంగతనాలు తగ్గుముఖం పడతాయన్నారు. పెద్ద నోట్ల రద్దు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింద న్నారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట అభివృద్దికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రమజీవి హరీష్‌రావు నేతృత్వంలో అటు అధికారులు ఇటు పార్టీ యంత్రాంగా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవసరమైన చిన్న నోట్ల సరఫరాను పెంచాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, లియాఖత్ ఖాన్‌లు పాల్గొన్నారు.
కార్డుతో కొనుగోలు : సిద్దిపేట రైతుబజార్‌లో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ రూపీ కార్డుతో కూరగాయలు కొనుగోలు చేశారు. శనివారం మథ్యాహ్నం రైతు బజర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో రూపీ కార్డుతో టోకెన్లు తీసుకుని కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అటు కొనుగోలుదార్లు, ఇటు అమ్మకందార్లతో మాట్లాడారు. నగదు రహిత కొనుగోల్లను రైతు బజార్‌లో ప్రారంభించడం వల్ల అందరూ సంతృప్తిగా వున్నామని పలువురు చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు అరంగంటకు పైగా కూరగాయలు కొనుగోలు చేయడంతో వారితో ముచ్చటిస్తూ చిల్లర సమస్యకు ప్రత్యామ్నాయంగా తీసుకున్న ఈ చర్యలపై అభిప్రాయాలు సేకరించారు.

Related Stories: