19, 20, 27 తేదీలలో ఎస్‌ఐ అభ్యర్థులకు తుది పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో తుది పరీక్ష తేదీలను నియామక బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 19న ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సివిల్, కమ్యూనికేషన్, పిటివో విభాగం అభ్యర్థులకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ విషయాలలో ఆప్జక్టివ్ పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సివిల్ అభ్యర్థులకు జనరల్ […]

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో తుది పరీక్ష తేదీలను నియామక బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 19న ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సివిల్, కమ్యూనికేషన్, పిటివో విభాగం అభ్యర్థులకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ విషయాలలో ఆప్జక్టివ్ పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సివిల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ విషయంలో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. 20 వ తేదీ ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంగ్లీష్‌లో రాసే అభ్యర్థులు వివరణాత్మక అంశంలో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తెలుగు, ఉర్ధూలో సివిల్ అభ్యర్థులకు వివరణాత్మక పరీక్ష ఉంటుంది. 27 వ తేదీన కమ్యూనికేషన్ విభాగంలోని ఎస్‌ఐ అభ్యర్థులకు ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆబ్జెక్టివ్‌లో టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పిటివో అభ్యర్థులకు టెక్నికల్ విభాగంలో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుందని నియామక బోర్డు ఛైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Comments

comments

Related Stories: