ఆమె అండ నిలువని మహిళా పోలీస్ స్టేషన్లు

బాధిత మహిళలు తమపై జరిగిన గృహహింస తది ఇతర దాడులపై ఫిర్యాదు చేయ డం మన దేశంలో చాలా అరుదుగాగాని జరగడం లేదు. ఈ సమస్యతీవ్రంగా ఉన్న విషయాన్ని నిపుణులు కూడా ఒప్పుకొంటున్నారు. మరింత అణచివేతకు గురవుతామన్న భయం, సామాజిక కట్టుబాట్లు, నేరం రుజువై శిక్ష పడిన కేసులు తక్కువ కావడం, పురుష ఆధిపత్యంలోఉన్న పోలీసు వ్యవస్థ నుంచి వేధింపులువల్ల చాలా మంది బాదితులు ఫిరాదు చేయకుండా మిన్నకుంటున్నారని భావించాలి. మన పురుషాధిక్య పోలీసు వ్యవస్థకు మహిళల […]

బాధిత మహిళలు తమపై జరిగిన గృహహింస తది ఇతర దాడులపై ఫిర్యాదు చేయ డం మన దేశంలో చాలా అరుదుగాగాని జరగడం లేదు. ఈ సమస్యతీవ్రంగా ఉన్న విషయాన్ని నిపుణులు కూడా ఒప్పుకొంటున్నారు. మరింత అణచివేతకు గురవుతామన్న భయం, సామాజిక కట్టుబాట్లు, నేరం రుజువై శిక్ష పడిన కేసులు తక్కువ కావడం, పురుష ఆధిపత్యంలోఉన్న పోలీసు వ్యవస్థ నుంచి వేధింపులువల్ల చాలా మంది బాదితులు ఫిరాదు చేయకుండా మిన్నకుంటున్నారని భావించాలి. మన పురుషాధిక్య పోలీసు వ్యవస్థకు మహిళల పట్ల సానుకూల ధోరణి లేదు. వారిని దిగలాగే వ్యవస్థ అది.
ఈ విషయం 2013 జనవరిలో బయటపడింది. ఢిల్లీలో నిర్భయ దారు ణం జరిగిన నెల రోజుల తరువాత ప్రభుత్వం నియమించిన కమిటీ దిగ్భ్రాంతి కర విషయాలను బయట పెట్టింది. పోలీసులు రేప్ బాధితులపై వేధింపుతో కూడిన అణచివేత వైఖరిని అవలంబిస్తున్నట్లు కమిటీ తెలిపింది.ఫిర్యాదులు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తారని, భాధితులను వేధింపులకు గురి చేస్తారని, లంచాలు అడుగుతారని దేశవ్యాప్తంగా సమాచారం ఉన్నట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మహిళలు ఇక తమ భద్రతకు ఢోకా ఉండ దన్న ధైర్యాన్ని పొందే విధంగా ‘అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్లు’ వచ్చాయి. గుర్గామ్‌లో అటువంటి పోలీస్ స్టేషన్ పారథ్య బాధ్యత వహిస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ధర్పా యాదవ్ ఏమంటున్నారంటే- ‘రేప్ బాధితురాలు ఎందరో పురుషులు యూనిఫాంలో ఉండే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి తటపటాయిస్తుంది. అందరూ మహిళలే ఉన్న ప్టేషన్ తనకు భద్రతనిస్తుందని ధైర్యం పొందుతుంది’ అని. ‘అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్’ను 1973లోనే కేరళలో మొట్టమొదట ఏర్పాటు చేశారు. తాజాగా హర్యానాలో ఇది ఏర్పాటైంది. ప్రస్తుతం ఇలాంటివి దేశంలో 500 దాకా ఉన్నాయి.
ఇది సరైన మార్గమేనా?
దేశంలోని మొత్తం పోలీస స్టేషన్ల సంఖ్య 15,000తో పోల్చితే ఇది చాలా స్వల్పమే కాని 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఘటన తరువాత ఈ చర్యకు మద్దతు చేకూరి హర్యానానుంచి పశ్చిమ బెంగాల్‌దాకా ‘అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్లు’ అస్తిత్వంలోకి వచ్చాయి. అయితే ఇది సరైన మార్గమేనా అన్న సందేహం కలుగుతోంది. లింగ భేదాలపాటింపుతో జరిగే దాడులపై పోరాటంలో ఇవి సఫలమౌతున్నాయా అన్నది అసలు ప్రశ్న.
ప్రజలు కోరుతున్నందువల్ల అవి ఏర్పాటైనట్లు కామన్ వెల్త్ మానవ హక్కుల సంస్థకు చెందిన దేవికాప్రసాద్ అన్నారు. అది ‘మహిళా పోలీసింగ్‌తో మహిళల స్థాయి మారిందా’ అన్నదానిపై అధ్యయనం జరిపిన క్యూఢిల్లీలోని సంస్థ. తమ రాకతో లింగ భేదాలు ఆధారంగా హింసాకాండ తగ్గుతున్నట్లు ‘అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్ల’వారు ఎంతగా చాటుకున్నా, మౌలిక సౌకర్యాల అంతరాన్ని పూడ్చడం జరగటం లేదని ఆమె తెలిపారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లతో కొత్తగా మౌలిక సౌకర్యాలకు గిరాకీ ఏర్పడుతోందని వివరించారు. దేశంలోని పోలీస్ బలగంలో మహిళల వాటా చాలా తక్కువగా ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు. అది కేవలం 6.44 శాతం. ఇది ఏడేళ్ల క్రితం నిర్దేశించిన 33 శాతం లక్షానికి ఎంతో దూరం.
మామూలు స్టేషన్లలో సంస్కరణలు చాలు
స్తై, పురుష భేదభావాల మూలంగా ఏర్పడే హింసాకాండ సమస్య పరిష్కారానికి మహిళా పోలీసు సిబ్భంది అతి ముఖ్యమని దేవికా ప్రసాద్ వివరించారు. మహిళల కేసులను ఏదో ఓ ప్రత్యేక మహిళా పోలీసు అడ్డాలోకి తోసే కంటె మామూలు పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచడం మేలని ఆమె సూచిస్తున్నారు. అలాగే మహిళలు నడిపే ‘హెల్ప్ డెస్కు’ల ను పటిష్ఠ పరచడం కూడా ముఖ్యమని సలహా ఇచ్చారు. పురుష పోలీసులు మహిళల కేసుల పట్ల జాగృతితో వ్యవమరించాలని కూడా ఆమె సూచించారు.
తీజాగా మహిళల ప్రత్యేక పోలీసు స్టేషన్లు వెలసిన హర్యానా ‘మహిళా ద్వేషం’ దురాచారానికి చాలా కాలంనుంచి పేరుబడ్డది. అన్ని రాష్ట్రాలలో కంటె ఆడ, మగ నిష్పత్తిలో అది చాలా వెనుకబడి ఉంది. ‘ఖాప్ పంచాయతీ’ లు, అందరూ పురుషులే ఉండే ‘గ్రామ మండళళ్లు’ అక్కడ విరివిగా ఉన్నాయి. వాటి ఆదేశాలు మహిళలను అదుపులో పెట్టడమే లక్షంగా ఉంటాయి. ‘పరువు హత్య’లకు కూడా ఆదాశాలిచ్చే తెగింపు వాటి సొంతం. అటువంటి పురుషాధిక్య వ్యవస్థ మధ్య అందరూ మహిళలే ఉండే పోలీసు స్టేషన్లు ‘పదునైన సందేశాన్ని’ ఇచ్చే రీతిలో పనిచేయాలని దేవిక వివరించారు. ఆమె బ్రెజిల్‌లో అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్లపై పరిశోధన చేస్తున్నారు. భారత్ తరువాత బ్రెజిల్ లోనే అటువంటి పోలీసు స్టేషన్లు ఉన్నాయి. మహిళలను కేవలం పురుష ఆభిజాత్యానికి సంకేతాలుగా భావించే హర్యానా వంటిసమాజాల్లో మహిళా పోలీస్ స్టేషన్‌లు చాలా శక్తివంతంగా తమ ఉనికి నిరూపించు కోవాలని అమెరికాలోని కొలరాడో కాలేజిలో ‘మానవ వికాస శాస్త్ర అధ్యాపకురాలు సారా హాట్ జింజెర్ పేర్కొన్నారు. అయితే అవి విజయం సాధించాలంటే రాజకీయదన్ను తప్పనిసరి అన్నారు. వాటిని నడిపే మహిళలకు తగినంతగా శిక్షణనిచ్చి, వనరులను కల్పించాలని కూడా సూచించారు.
బ్రెజిల్‌లో ఇటువంటి పోలీసుస్ఠేషన్లు వచ్చాక హత్యల రేటు తగ్గినట్లు గత ఏడాది ప్రపంచబ్యాంకు అధ్యయన పత్రం పేర్కొందని ఆమె చెప్పారు. భారత దేశంలో ఈ అంశంపై చర్చ ముం దుకు సాగుతున్నకొద్దీ బ్రెజిల్‌తో అంతరాలను పూరించడానికి నిపుణులు కృషి చేస్తున్నారు. హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది చివర్లో ఆయా పోలీసుస్టేషన్ల పనితీరుపై ఆడిట్ నివేదికను సమర్పించనుంది.
బాధితులకు అందని ఏర్పాటు
చాలా బలహీన స్థితిలో ఉన్న బాధితులను ప్రత్యేక పోలీసుస్టేషన్లు చేరుకోవటం లేదని మహిళా బృందాలు ఆందోళనచెందుతున్నాయి. సాక్షం చెప్పడానికి లేదా వాంగ్మూలం ఇవ్వడానికి మహిళలు భయపడేవిధంగాఆ మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని వారంటున్నారు. మహిళలు ఇంకా భయ వాతావకణం లోనే మగ్గిపోతున్నారని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కవితా కృష్ణన్ తెలిపారు. హర్యానాకు చెందిన ఒక దళిత విద్యార్థినిని మూడేళ్ల క్రితం రేప్ చేసిన అయిదుగురు వ్యక్తులే జైలునుంచి బెయిలుపై విడుదలయ్యా క గత జూలైలో తిరిగి రేప్ చేశారు. బాధితురాలు వారిపై క్రిమినల్ అభియోగా నమోదయ్యేలా ఫిర్యాదు చేయడంతో ఆవిధంగా కక్ష సాధించుకొన్నారు. తాము ఇంకా శైశవ దశలోనే ఉన్నామని హర్యానాలో ‘అంతా మహిళలే ఉండే పోలీస్ స్టేషన్ల’ పర్యవేక్షక అధికారి ఒకరు తెలిపారు. ఈ దీనినిబట్టి ఆచరణలో ఆయా పోలీస్ స్టేషకన్ల ప్రభావం నిల్ అని చెప్పవచ్చు.

Comments

comments

Related Stories: