ధనుష్ చిత్రంలో ఆల్ పాచినో?

ధనుష్ ఒక చిన్న హీరోగా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు భారతదేశ సినీరంగాన్ని ఊపేస్తున్న నటుడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కాగా ధనుష్ ఇప్పుడు తన అభిమానులకు మాత్రమే కాదు.. భారత దేశ సినీ అభిమానులకు ఓ అద్భుతమైన కానుక ఇవ్వనున్నాడు. ధనుష్, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న తర్వాతి ప్రాజెక్టులో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అల్ పాచినో నటించనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ […]

ధనుష్ ఒక చిన్న హీరోగా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు భారతదేశ సినీరంగాన్ని ఊపేస్తున్న నటుడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కాగా ధనుష్ ఇప్పుడు తన అభిమానులకు మాత్రమే కాదు.. భారత దేశ సినీ అభిమానులకు ఓ అద్భుతమైన కానుక ఇవ్వనున్నాడు. ధనుష్, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న తర్వాతి ప్రాజెక్టులో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అల్ పాచినో నటించనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక కథనం ప్రకారం… ‘గాడ్ ఫాధర్’ ఫేం ఆల్ పాచినో ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారట.. అయితే చిత్ర బృందం తొలుత ఈ పాత్ర కోసం మరో హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్‌ను అనుకున్నారట.. కానీ ఆ తర్వాత ఆ పాత్ర కోసం ఆల్ పాచినోను సంప్రదించగా ఆయన ఓకే అన్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తిగా అమెరికాలో జరగనుంది. అయితే ఈ అంశంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు.

Comments

comments

Related Stories: