హాట్ బ్యూటీ క్యాథరిన్ మరోసారి రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోందట. అల్లుఅర్జున్‌తో కలిసి చేసిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘సరైనోడు’ చిత్రంలో ఈ భామ ఎమ్మెల్యేగా నటించి అలరించింది. ఈ సినిమాలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే హన్సిత రెడ్డి పాత్రలో క్యాథరిన్ ప్రేక్షకులను మురిపించింది. ఈ చిత్రం, క్యారెక్టర్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్‌సాంగ్ చేసే సువర్ణావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్న ఈ అమ్మడికి మరోసారి రాజకీయ నాయకురాలిగా నటించే అవకాశం లభించింది. తేజ దర్శకత్వంలో రానా, కాజల్ అగర్వాల్ జంటగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ పేరుతో ఈ చిత్రం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్న క్యాథరిన్ రాజకీయ నాయకురాలిగా దర్శనమిస్తుందట.
మరోసారి రాజకీయ నాయకురాలిగా క్యాథరిన్
హాట్ బ్యూటీ క్యాథరిన్ మరోసారి రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోందట. అల్లుఅర్జున్‌తో కలిసి చేసిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘సరైనోడు’ చిత్రంలో ఈ భామ ఎమ్మెల్యేగా నటించి అలరించింది. ఈ సినిమాలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే హన్సిత రెడ్డి పాత్రలో క్యాథరిన్ ప్రేక్షకులను మురిపించింది. ఈ చిత్రం, క్యారెక్టర్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్‌సాంగ్ చేసే సువర్ణావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్న ఈ అమ్మడికి మరోసారి రాజకీయ నాయకురాలిగా […]